85 రోజులు క‌రోనా, బ్లాక్ ఫంగ‌స్‌తో పోరాడి గెలిచిన వ్యక్తి..!

కరోనా మహమ్మరి ప్రపంచ దేశాలను అతలాకుతలం చేసింది.ఆర్థిక వ్యవస్థను నాశనం చేసింది.

ఇప్పుడిప్పుడే అభివృద్ధి చెందుతున్న దేశాల పరిస్థితిని మరీ దిగదార్చాయి.ఎలాగోలా దానిని ఎదుర్కొన్నాం.

ఇంకా ఎదుర్కొంటూనే ఉన్నాం.కరోనా మహ్మమారి కొందరికి ఇంటి దగ్గరే తగ్గిపోతే.

మరి కొందరిని హాస్పిటల్​ వరకు తీసుకెళ్లింది.మరి కొందరికైతే ఆక్సిజన్​ పెట్టి స్టెరాయిడ్స్​ ఎక్కించే పరిస్థితి వరకు తీసుకెళ్లింది.

ఇంట్లో కోలుకున్న వారి పరిస్థితి బాగానే ఉంది.కానీ హాస్పిటల్స్​లో స్టెరాయిడ్స్​ ఎక్కించుకొని బాగైన వారిలో కొందరి పరిస్థితి తరువాత ఇబ్బందిగా మారింది.

కరోనా నుంచి కోలుకున్నాం రా బాబు అనుకునే లోపే కొందరిని బ్లాక్​ ఫంగస్​ అటాక్​ చేసింది.

బ్లాక్​ ఫంగస్​ అంటే అప్పట్లో చాలా మందికి తెలియదు.ఇదో కొత్త వైరస్ అనుకున్నారు.

కానీ ఇది వైరస్​ వల్ల వచ్చే వ్యాధి కాదని, కరోనా ట్రీట్​మెంట్​ కోసం వాడిన మందుల వల్ల వచ్చిన ఫంగల్​ ఇన్​ఫెక్షన్​ అని డాక్టర్లు తేల్చారు.

ఇది చాలా ప్రమాదకరంగా తయారైంది.ఇది సోకిన వారు చాలా మంది ఇబ్బంది పడ్డారు.

పళ్లు ఊడిపోవడం, కళ్ల కింద, ముక్కు భాగంపైన మచ్చలు ఏర్పడటం వంటివి ఈ ఇన్ ఫెక్షన్​ లక్షణాలు.

కొందరికి ఈఎన్​టీ నిపుణుల వైద్య బృందం గంటల తరబడి కష్టపడి సర్జరీలు కూడా చేయాల్సిన పరిస్థితులు ఏర్పడ్డాయి.

కొందరు ఆ ట్రీట్మెంట్​ దశలోనే చనిపోయారు. """/"/ కానీ ఓ వ్యక్తి మాత్రం 85 రోజులు బ్లాక్​ ఫంగస్​తో పోరాడి చివరికి విజయం సాధించాడు.

ముంబాయికి చెందిన యాబై నాలుగేళ్ల భరత్​ పంచాల్​ మూడు నెలల పాటు బ్లాక్​ ఫంగస్​ ట్రీట్​మెంట్​ తీసుకొని, వ్యాధిని నయం చేసుకొని ఇంటికి చేరాడు.

ఇగ కుటుంబ సభ్యుల ఆనందానికి అవదులు లేకుండా పోయాయి.కష్టపడి ట్రీట్​మెంట్​ చేసిన డాక్టర్లకు, హాస్పిటల్​ సిబ్బందికి కుటుంబ సభ్యులు, భరత్​ పంచాల్​ కృతజ్ఞతలు తెలిపారు.

వైరల్: అరటిపండును ఇలా ఎపుడైనా తిన్నారా? అమ్మబాబోయ్!