డీజే సౌండ్‌తో కోళ్లు చ‌నిపోయాయంటూ ఫిర్యాదు చేసిన వ్య‌క్తి

ఒక‌ప్పుడు పెండ్లి అంటే ఏదో అలా జ‌రిగిపోయేది.కానీ ఇప్పుడు పెండ్లి అంటే బ‌రాత్ క‌చ్చితంగా ఉండాల్సిందే.

డీజే సౌండ్ల‌లో మోత మోగిపోవాల్సిందే.ఎక్క‌డైతే పెండ్లి ఉంటుందో ఆ ప్రాంతం మొత్తం డీజే పాట‌ల‌తో ద‌ద్ద‌రిల్లిపోతుంది.

అయితే ఇది అక్క‌డ ఎంజాయ్ చేసే వారికి బాగానే అనిపించినా దాని చుట్టు ప‌క్క‌ల ఉండే వారికి మాత్రం చాలా ఇబ్బంది క‌రంగా అనిపిస్తుంది.

దాని సౌండ్‌కు చెవులు ప‌గిలిపోతాయేమో అనిపించేలా ఉంటుంది.ఇక ఈ మ‌ధ్య బేస్ సౌండ్లో కూడిన డీజేలు వ‌స్తుండ‌టంతో దీని సౌండ్ మ‌రింత‌గా పెరిగిపోయింది.

అయితే ఇప్పుడు డీజే సౌండ్ కార‌ణంగా కోళ్లు చ‌నిపోయాయంటూ ఓ వ్య‌క్తి ఫిర్యాదు చేయ‌డం పెను సంచ‌ల‌నంగా మారింది.

అదేంటి అనుకోకండి మీరు విన్న‌ది నిజ‌మే.ఒక‌టి కాదు రెండు కాదు ఏకంగా 63 కోళ్లు చనిపోయాయంటూ ఆ వ్య‌క్తి కంప్ల‌యింట్ ఇచ్చాడు.

ఒడిశా రాష్ట్రంలోని బాలాసోర్ ప్రాంతంలో నివ‌సించే రంజిత్ ఎప్ప‌టి నుంచో కోళ్లఫారమ్ ను న‌డిపించుకుంటూ జీవ‌నం సాగిస్తున్నాడు.

అయితే గత ఆదివారం నాడే త‌న ఫామ్ కు ద‌గ్గ‌ర‌లో ఉండే ఓ ఇంట్లో పెండ్లి జ‌రిగింది.

ఇక రాత్రి పూట చెవులకు గిల్లు మ‌నేలా డీజే సౌండ్‌ పెట్టారు. """/" / ఇంకేముంది ఆ భారీ సౌండ్‌కు కోళ్లు గిలగిలలాడి పడిపోయాయంట‌.

దీంతో రంజిత్ వారి వ‌ద్ద‌కు వెళ్లి కాస్తంత సౌండ్ తగ్గించాలంటూ ఎంత వేడుకున్నా స‌రే వారు మాత్రం విన‌క‌పోగా ఇంకా సౌండ్ పెంచే స‌రికి కోళ్లు మృతి చెందాయంట‌.

దీని మీద రంజిత్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు.ఇక 63 కోళ్ల బ‌రువు దాదాపు 180 కిలోలు ఉంద‌ని రంజిత్ వివ‌రించాడు.

సౌండ్ ఎక్కువ కావ‌డంతో గుండెపోటు వ‌చ్చి కోళ్లు మొత్తం చ‌నిపోయాయని వెట‌ర్న‌రీ డాక్ట‌ర్లు కూడా నిర్దారించి చెప్పారంట‌.

ఇక ఈ కేసుమీద పోలీసులు ద‌ర్యాప్తు ప్రారంభించారు.

Naga Chaitanya : గాయపడిన మనసు అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసిన చైతన్య.. కన్నీళ్లు పెట్టించారుగా?