సూర్యాపేట జిల్లా:చెరువులో చేపల వేటకు వెళ్లి చేపల వలలో చిక్కుకొని ఓ మృతి చెందిన ఘటన జి.
కొత్తపల్లి గ్రామంలో చోటుచేసుకుంది.మద్దిరాల మండలం జి.
కొత్తపల్లి గ్రామానికి చెందిన బొబ్బిలి వెంకన్న (49) సోమవారం నాడు కొత్తపల్లి చెరువుకు వలతో చేపలు పట్టడానికి వెళ్లి చేపలు పడుతుండగా ప్రమాదవశాత్తు తన రెండు కాళ్లకు వల చిక్కుకొని నీటిలో మునిగి ఊపిరి ఆడక చనిపోయాడని స్థానికులు తెలిపారు.
మృతుని భార్య బొబ్బిలి సువార్త మద్దిరాల పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని మద్దిరాల ఎస్ఐ వెంకన్న తెలిపారు.
లిబరల్స్‌దే హవా .. కెనడా ఫెడరల్ ఎన్నికలపై సంచలన సర్వే