దుస్తులపై ఉమ్ముతూ ఇస్త్రీ చేస్తున్న దరిద్రుడు!
TeluguStop.com
ఇంటర్‌నెట్ వాడకం పెరిగిన తర్వాత సోషల్ మీడియా విస్తృతంగా ప్రాచుర్యంలోకి వచ్చింది.ప్రపంచంలో ఎక్కడ ఏ ఆసక్తికర సంఘటన జరిగినా మనకు క్షణాల్లో తెలిసిపోతుంది.
ఫలితంగా మనం ఫోన్లలో వాటి చూస్తూ ప్రతిస్పందిస్తున్నాం.చాలా సంఘటనల్లో ఇతరులు చేసే కొన్ని అసహ్యమైన పనులు మనకు తెలుస్తున్నాయి.
తినే తిండిలో కొందరు ఉమ్మి వేసి ఇవ్వడం ఇటీవల కాలంలో చూశాం.రోటీల తయారీలో, ఇతర ఆహార పదార్థాల తయారీలో ఉమ్మి వేసిన వీడియో చూసి ఆ దరిద్రులను తిట్టుకున్నాం.
అయితే చాలా మంది ఇదే తరహాలో ప్రవర్తిస్తున్నారు.తాజాగా ఓ వ్యక్తి ఇస్త్రీ చేసేటప్పుడు దుస్తులపై ఉమ్ముతున్న వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
దీనికి సంబంధించిన వివరాలిలా ఉన్నాయి.ఇటీవల అడల్ట్ సొసైటీ అనే ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ఓ వీడియోను పోస్ట్ చేశారు.
అందులో ఓ వృద్ధుడు నోట్లో నీళ్లు పోసుకుని, వాటిని దుస్తులపై ఉమ్ముతున్నాడు.సాధారణంగా బొగ్గులతో కూడిన ఇస్త్రీపెట్టెతో ఇస్త్రీ చేసే సమయంలో ముందుగా దుస్తులపై కాసిన్ని నీళ్ల చుక్కలు చల్లుతారు.
ముడతలు పోయి, చక్కగా ఇస్త్రీ వచ్చేందుకు అలా చేస్తారు.అయితే వైరల్ అవుతున్న వీడియోలో మాత్రం ఆ వృద్ధుడు విభిన్నంగా ప్రవర్తించాడు.
ఏకంగా నోట్లో నీళ్లు పోసుకుని, అవి తుంపర్లుగా పడేలా దుస్తులపై ఉమ్మాడు.జుగుప్సాకరంగా అతడు ఈ పనులను యథేచ్చగా చేసేస్తున్నాడు.
అసలే కరోనా కావడంతో అందరూ ఎన్నో జాగ్రత్తలను తీసుకుంటున్నారు.అయితే ఆ వృద్ధుడు మాత్రం కనీసం నైతికత లేకుండా ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నాడు.
మామూలుగా దుస్తులు అంటేనే చాలా జాగ్రత్తగా చూసుకుంటుంటారు.అలాంటి వాటిపై ఉమ్మడం నిజంగా వినడానికే చిరాకుగా ఉంది.
ఈ వీడియో నెట్టింట వైరల్ అవగానే సదరు వృద్ధుడిని చాలా మంది తిడుతున్నారు.
సుజీత్ నెక్స్ట్ సినిమాకి హీరో దొరికేశాడా..?