శ్మశానంలో క్షుద్ర పూజలు.. బాలిక తల నరికి తీసుకెళ్లిన మాంత్రికుడు!

ప్రస్తుతం టెక్నాలజీ రోజురోజుకు కొత్త పుంతలు తొక్కుతోంది.5జీ యుగంలో కూడా మూఢనమ్మకాలు ఇంకా పూర్తి స్థాయిలో తగ్గుముఖం పట్టలేదు.

కొన్ని ప్రాంతాల్లో మూఢ నమ్మకాలు తిష్ట వేసుకొని మరీ కూర్చున్నాయి.వీటి వల్ల నిండు ప్రాణాలు బలవుతున్నాయి.

దేశవ్యాప్తంగా ఇలాంటి సంఘటనలు తరచూ వార్తల్లో కనిపిస్తుంటాయి.మూఢ నమ్మకాల పేరుతో కొందరు వ్యక్తులు విచక్షణా రహితంగా ప్రవర్తిస్తుంటారు.

ఆరోగ్యం బాగుపడాలని, ఆస్తులు పెరగాలని, సమస్యలు దూరమవ్వాలని.ఇలా ప్రతి చిన్న సమస్యను భూతద్దంలో చూసి పెద్దది చేసుకుంటున్నారు.

క్షుద్రపూజలు, మంత్రాలు, పూజలంటూ దారుణాలకు పాల్పడుతున్నారు.ఇలాంటి ఓ ఘటనే తాజాగా తమిళనాడు రాష్ట్రంలో చోటు చేసుకుంది.

క్షుద్ర పూజల కోసం ఓ మాంత్రికుడు శ్మశానంలోకి ప్రవేశించి బాలిక తలను నరికి తీసుకెళ్లాడు.

దీంతో స్థానికంగా ఈ వార్త తీవ్ర కలకలం రేపుతోంది.పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.

తమిళనాడులోని చెంగల్పట్టు జిల్లా మధురాంతకం మండలం చిత్తిరవాడి గ్రామానికి చెందిన కృతిక (12) ఆరవ తరగతి చదువుతోంది.

ఈ నెల 5వ తేదీన తన అమ్మమ్మ దగ్గరికి వెళ్లింది.అక్కడ కృతికపై ప్రమాదవశాత్తు కరెంట్ పోల్ విరిగిపడింది.

దీంతో బాలిక అక్కడికక్కడే ప్రాణాలు విడిచింది. """/"/ అనంతరం బాలికను శ్మశాన వాటికలో ఖననం చేశారు.

అయితే ఈ నెల 25వ తేదీన అమావాస్య రోజు నాడు బాలిక మృతదేహాన్ని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బయటికి తీశారు.

బాలికను పాతిపెట్టిన స్థలంలో క్షుద్ర పూజలు కూడా జరిపినట్లు ఆనవాళ్లు ఉన్నాయి.అయితే బాలిక మృతదేహాన్ని చూసిన ప్రతిఒక్కరూ మాత్రం భయాందోళనకు గురవుతున్నారు.

బాలిక తలను నరికి తీసుకెళ్లి.డెడ్ బాడీని మాత్రం వదిలేసి వెళ్లారు.

ఇది గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు.ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

బాలిక తలను క్షుద్ర పూజల కోసమే నరికారా? లేదా మరే ఇతర కారణాల వల్ల తీసుకెళ్లారా? ఎవరూ ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు? అనే కోణంలో విచారణ జరుపుతున్నారు.

పవిత్ర లోకేశ్ వచ్చిన తర్వాత నా లైఫ్ అలా ఉంది.. నరేష్ సంచలన వ్యాఖ్యలు వైరల్!