నెలకి రూ.1 లక్ష పొదుపు.. లగ్జరీ తగ్గించుకోలేదు.. బెంగళూరు యువతి సేవింగ్స్ ప్లాన్ వైరల్..

బెంగళూరుకు చెందిన ఓ 23 ఏళ్ల అమ్మాయి రెడిట్‌లో (Reddit) తన సంపాదన, ఖర్చుల గురించి పోస్ట్ పెట్టి దుమ్ము రేపింది.

వయసులోనే నెలకు ఏకంగా లక్ష రూపాయలు పొదుపు (Savings) చేస్తోందట.అంతేకాదు, తన లైఫ్‌స్టైల్ కోసం మరో రూ.

70,000 ఖర్చు పెడుతోందట."నా ఆర్థిక నిర్ణయాలపై మీ ఇష్టం వచ్చినట్లు కామెంట్ చేయండి.

నన్ను ఏమైనా అనుకోండి" అంటూ ఓపెన్ ఛాలెంజ్ విసిరింది.ఇంకేముంది, ఆన్‌లైన్‌లో ఈ పోస్ట్ వైరల్ అయిపోయి, పెద్ద చర్చకే దారితీసింది.

తన పోస్టులో నెలవారీ ఖర్చుల వివరాలు కూడా పక్కాగా చెప్పింది.ఇంటి నుంచే పనిచేస్తున్నా (Work From Home), 1BHK అపార్ట్‌మెంట్ కోసం ఏకంగా రూ.

27,000 అద్దె కడుతోందట.నెట్‌ఫ్లిక్స్ సబ్‌స్క్రిప్షన్ కోసం రూ.

199.AI టూల్ క్లాడ్ ప్రో (Claude Pro) కోసం రూ.

2,000.ఇంట్లో వంట ఖర్చులకు రూ.

15,000.బయట రెస్టారెంట్లలో తినడానికి (Dining Out) రూ.

10,000, వాటర్ బిల్లు రూ.499, కరెంట్ బిల్లు రూ.

700 ఖర్చు చేస్తున్నట్టు చెప్పింది.అంతేకాదు, తన తల్లిదండ్రుల కోసం బహుమతులు, ఇతర వస్తువులకు నెలకు సుమారు రూ.

10,000 పంపుతుందట.ఇన్ని ఖర్చులు చూసి షాక్ అవ్వడం ఖాయం.

ఇవన్నీ (దాదాపు రూ.70,000) పోనూ, ప్రతీ నెలా కచ్చితంగా లక్ష రూపాయలు పొదుపు ఎలా చేస్తుందని డౌట్ మీకు రావచ్చు.

ఆమె మాటల్లోనే, "నా ఖర్చు సుమారు రూ.70,000 ఉంటుంది, లక్ష రూపాయలు పొదుపు చేస్తాను.

నాకు సిగరెట్, మద్యం తాగడం, పార్టీలు చేసుకోవడం లాంటి చెడు అలవాట్లు లేవు.

నా ఫోకస్ అంతా ఫ్యామిలీ మీద, మంచి ఫుడ్ ఎంజాయ్ చేయడం మీదనే ఉంటుంది.

అమ్మానాన్నల కోసం ఖర్చు చేయడం, మంచి రెస్టారెంట్లలో తినడం నాకు ఇష్టం" అని రాసుకొచ్చింది.

"""/" / ఇంత సంపాదన అనగానే, చాలామంది ఆమె జాబ్ ఏంటి? శాలరీ ఎంత? అని ఆరా తీశారు.

తను కేవలం ఒక్క ఏడాదిలోనే చాలా ఉద్యోగాలు మారినట్లు చెప్పింది.చాలామంది నెటిజన్లు ఏదో పెద్ద టాప్ కాలేజీలో చదివి ఉంటుందని ఊహించుకున్నారు.

కానీ ఆమె ఇచ్చిన రిప్లై అదిరిపోయింది."నేను VIT లాంటి కాలేజీలోనే చదివాను.

మీ జీతాన్ని మీ కాలేజీ నిర్ణయించదు" అంటూ కాలేజీ బ్రాండ్‌ కన్నా స్కిల్స్, తెలివితేటలే ముఖ్యమని చెప్పకనే చెప్పింది.

"""/" / ఈ పోస్ట్‌కి రకరకాల రియాక్షన్లు వచ్చాయి.ఒకరైతే, "వావ్, 23 ఏళ్లకే నెలకు రూ.

1.7 లక్షల సంపాదనంటే.

నువ్వు మమ్మల్నే రోస్ట్ చెయ్ బదులుగా" అని కామెంట్ పెట్టాడు.ఇంకొకరు, "వర్క్ ఫ్రమ్ హోమ్ అయినప్పుడు అంత అద్దె ఎందుకు దండగ?" అని లాజిక్ తీశారు.

కానీ చాలామంది ఆమెను మెచ్చుకున్నారు."ఖర్చుల కన్నా పొదుపు ఎక్కువ చేస్తూ, అమ్మానాన్నలను సంతోషంగా చూసుకుంటూ, ప్రశాంతంగా ఉంటున్నావ్, నువ్వు సూపర్ అంతే," అని ప్రశంసించారు.

మరికొందరు, ఆ లక్ష రూపాయల పొదుపును ఈక్విటీ మార్కెట్లు, FDలు, RDలు, బంగారంలో తెలివిగా ఇన్వెస్ట్ చేయమని మంచి ఆర్థిక సలహాలు కూడా ఇచ్చారు.