నాపై కురిపిస్తున్న ప్రేమ ఇక చాలు… సీనియర్ నటి తులసి ఎమోషనల్ కామెంట్స్!

తెలుగు సినీ ప్రేక్షకులకు సీనియర్ నటి తులసి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.

బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన తులసి అనంతరం పలు సినిమాలలో హీరోయిన్ గాను,క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ ఎంతో మంది హీరో హీరోయిన్లకు తల్లి పాత్రలలో నటించి మెప్పించారు.

ఇలా వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నటువంటి నటి తులసి తాజాగా సోషల్ మీడియాలోకి అడుగు పెట్టారు.

ఇలా ఈమె సోషల్ మీడియాలోకి అడుగుపెట్టడంతో ఈమెపై అభిమానులకు ఎంత ప్రేమ ఉందో తెలుస్తోంది.

ఇలా సోషల్ మీడియాలోకి అడుగుపెట్టిన నటి తులసి ఫేస్ బుక్ పేజ్ తో పాటు ఇంస్టాగ్రామ్ లోకి కూడా అడుగు పెట్టారు.

"""/"/ ఈ విధంగా ఇంస్టాగ్రామ్ లోకి అడుగుపెట్టిన అతి తక్కువ సమయంలోనే ఈమెకు ఏకంగా 50 వేల మంది ఫాలోవర్స్ వచ్చారు.

ఇలా అతి తక్కువ సమయంలోనే ఎక్కువ మంది ఫాలోవర్స్ రావడంతో ఈ విషయంపై స్పందిస్తూ సోషల్ మీడియా వేదికగా ఒక వీడియోని షేర్ చేశారు.

ఈ వీడియోలో తులసి మాట్లాడుతూ నామీద అంత ప్రేమ ఏంటండీ బాబోయ్.మీ అందరికీ నేను రుణపడి ఉంటాను మీ ప్రేమ వల్లే నేను ఇలా ఉన్నాను.

చాలండి నాకు ఇంకేమీ అక్కర్లేదు.ఇది ఎంతో గొప్ప విషయం ఇదే నా ఆస్తి, ఇంకా చాలు నా మీద మీరు కురిపిస్తున్న ప్రేమ ఇక చాలు అంటూ ఆమె ఎమోషనల్ అవుతూ వీడియో చేసింది.

"""/"/ ఇలా అభిమానులు తనపై చూపిస్తున్నటువంటి ప్రేమకు ఈమె ఫిదా అయ్యారు.దీంతో అభిమానుల ప్రేమకు తాను ఎప్పుడు రుణపడి ఉంటాను అంటూ ఈ విధంగా సోషల్ మీడియా వేదికగా ఈమె చేసినటువంటి వీడియో వైరల్ గా మారింది.

ఇండస్ట్రీలో ఈమె కేవలం తెలుగులో మాత్రమే కాకుండా హిందీ కన్నడ తమిళ భాషలతో పాటు భోజ్పురి సినిమాలలో కూడా నటించారు.

ఇలా తన సినీ కెరియర్లో సుమారు 300 కు పైగా సినిమాలలో నటించిన తులసి రెండు నంది అవార్డులను ఒక ఫిలింఫేర్ అవార్డును కూడా అందుకున్నారు.

ప్రస్తుతం ఈమె పలు సినిమాలలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ సందడి చెప్తున్నారు.

యూఎస్ మిలిటరీ ఫ్లైట్‌లో భారతీయుడికి నరకం.. కాళ్లు, చేతులు బంధించి ఘోర అవమానం..