నష్టం అంతా ఇంతా కాదు… నేడు కేంద్ర బృందం రాక

అకస్మాత్తుగా కురిసిన భారీ వర్షాలు వరదలతో రెండు తెలుగు రాష్ట్రాలకు జరిగిన నష్టం అంతా ఇంతా కాదు.

ఈ వర్షాలు,  వరదలతో జనాలు అష్ట కష్టాలను ఎదుర్కొన్నారు ఎంతోమంది ప్రాణాలను కోల్పోగా,  భారీగా ఆస్తి నష్టం జరిగింది.

  ఇక వర్తక వ్యాపారాలు ఎక్కడకక్కడ స్తంభించిపోయాయి.ముఖ్యంగా ఏపీలోని విజయవాడ( Vijayawada In AP ) నగరానికి వచ్చిన కష్టం అంతా ఇంతా కాదు.

వాణిజ్య రాజధానిగా ఉన్న విజయవాడలో గత నాలుగు రోజుల నుంచి పూర్తిగా వ్యాపారాలన్నీ మూతపడ్డాయి .

వందల కోట్ల రూపాయల నష్టం వాటిల్లింది.ఆ నష్టాన్ని అంచనా వేయడానికి కూడా అవకాశం లేదన్నట్లుగా పరిస్థితి ఏర్పడింది.

గత నాలుగు రోజుల నుంచి పడిన భారీ వర్షాలతో ప్రకాశం బ్యారేజీ( Prakasam Barrage ) నుంచి 11 లక్షల క్యూ సెక్కుల నీరు ఒక్కసారిగా విడుదల కావడంతో విజయవాడ చాలావరకు మునిగిపోయింది.

చాలా వరకు ఇళ్లు ముంపునకు గురికాగా,  మరికొన్నిచోట్ల జనాలు ఇళ్ల నుంచి బయటికి వచ్చే పరిస్థితి లేకుండా పోయింది.

"""/" /  అనేక స్వచ్ఛంద సంస్థలు,  ప్రభుత్వం వరద బాధితులకు, ఆహారం, నీరు నిత్యావసరాలు అందిస్తూ తమ మానవత్వాన్ని చాటుకున్నాయి.

ఇది కొంతవరకు ఉపశమనం కలిగించినా,  ప్రజలకు జరిగిన నష్టం అయితే ఎవరూ తీర్చలేనిది.

విజయవాడ( Vijayawada ) కేంద్రంగా జరిగే వ్యాపార వ్యవహారాలన్నీ పూర్తిగా నిలిచిపోయాయి.లారీలు ,బస్సులు ఇతర రవాణా వాహనాలన్నీ నిలిచిపోయాయి.

చిన్నా చితక వ్యాపారాలతో కుటుంబాన్ని నెట్టుకొస్తున్న  చిరు వ్యాపారులంతా ఉపాధి కోల్పోయారు. """/" / నేడు కేంద్ర బృందం రాక ఏపీకి నేడు కేంద్ర బృందం ( Central Team )రానుంది ముఖ్యంగా కృష్ణ గుంటూరు జిల్లాల్లో జరిగిన వరద నష్టం అంచనా వేసినందుకు ఈ బృందం పర్యటించనుంది హోం శాఖ అదనపు కార్యదర్శి నేతృత్వంలో ఈ బృందం ఏపీకి చేరుకుని వరద నష్టాన్ని అంచనా వేయనుంది వరద బాధితులతో కేంద్ర బృందం నేరుగా మాట్లాడనుంది అలాగే వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించి జరిగిన నష్టాలను అంచిన వేనుంది క్షేత్రస్థాయిలో వరద నష్టాన్ని పరిశీలించి వరద నష్టం అంచనాల వివరాలను నివేదిక రూపంలో కేంద్రానికి అందజేయనున్నారు అలాగే ప్రకాశం బ్యారేజీని పరిశీలించనున్నారు.

నా ప్రాణాలకు రక్షణ కల్పించండి.. కెనడా పోలీసులకు హిందూ ఆలయ అధిపతి లేఖ