మళ్ళీ కూల్ డ్రింక్లో బల్లి వచ్చింది.. లక్షరూపాయల జరిమానా!

ఇలాంటి న్యూస్ ని మీరు తరచూ వినే వుంటారు.బేసిగ్గా మన వంటగదిలోని గోడమీద బల్లిని చూస్తేనే మనకు ఒళ్ళు గగుర్పుడుతుంది.

అలాంటిది మనం తాగే పానీయాలలో బల్లి అంటే, ఒకింత వెగటు పుట్టక మానదు.

సరిగ్గా ఇలాంటి ఘటన అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్‌లో జరిగింది.అయితే బాధితుడు ఈ విషయాన్ని సీరియస్‌గా తీసుకోవడంతో కూల్ డ్రింక్‌లో బల్లి వచ్చిన ఫొటోలు సోషల్ మీడియాలో హల్ చల్ చేసాయి.

దాంతో సదరు ఔట్‌లెట్‌ను తాత్కాలికంగా మూసివేసిన AMC అధికారులు, అది సర్వ్ చేసిన సంస్థకు రూ.

1 లక్ష భారీ జరిమానా విధించారు.వివరాల్లోకి వెళితే, భార్గవ్ జోషికి అనే వ్యక్తికి బాగా ఆకలి వేయడంతో మే 21న అహ్మదాబాద్‌లో మెక్‌డొనాల్డ్స్‌కు వెళ్లాడు.

మొదట ఏదో ఆర్డర్ చేసి తిన్నాడు.ఆపై కూల్ డ్రింక్ సైతం తాగుదామని ఆర్డర్ చేశాడు.

అయితే దాన్ని తాగుదామని చూసిన అతడికి షాక్ తగిలింది.సర్వ్ చేసిన కూల్ డ్రింక్‌లో ఉన్న జీవిని చూసి ఒక్కసారిగా బిత్తరబోయాడు.

ఆ పానియంలో చనిపోయిన బల్లి వచ్చింది.వెంటనే ఫొటోలు తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.

మెక్ డోనాల్డ్స్‌లో కూల్ డ్రింక్ ఆర్డరిస్తే తనకు ఏం సర్వ్ చేశారో చూడండంటూ భార్గవ్ జోషి పోస్ట్ చేసిన ఫొటోలు సోషల్ మీడియాలో స్పీడుగా వైరల్ అయ్యాయి.

"""/" / దీనిపై స్పందించిన పౌరసరఫరాల సంస్థ.3 నెలల పాటు రెస్టారెంట్‌లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించనున్నట్టు తెలిపింది.

ఈ సందర్భంగా మెడికల్ ఆఫీసర్ మాట్లాడుతూ, మెక్‌డొనాల్డ్స్‌లో కూల్ డ్రింక్‌లో బల్లి రావడం అనేది సాధారణ విషయం కాదని, ఇలాంటి వాటిని ఉపేక్షించకూడదని AMC (అహ్మదాబాద్ మునిసిపల్ కార్పొరేషన్) మెడికల్ హెల్త్ ఆఫీసర్ డాక్టర్ భవన్ జోషి అన్నారు.

ఈ క్రమంలో అహ్మదాబాద్‌లోని సోలా ప్రాంతంలోని మెక్‌డొనాల్డ్స్ అవుట్‌లెట్‌కు రూ.1 లక్ష జరిమానా విధించారు.

హత్యాయత్నం జరిగిన స్పాట్‌కి మరోసారి ట్రంప్.. ఎలాన్ మస్క్‌తో కలిసి భారీ ర్యాలీ