జిరాఫీ పిల్లపై కన్నేసిన సింహం.. తల్లికి తెలిసి ఏం చేసిందంటే..
TeluguStop.com

అడవి ఎప్పుడూ అలజడిగానే ఉంటుంది.అక్కడ బతకాలంటే ఒక జీవితో మరో జీవి పోరాడాల్సిందే.


లేకపోతే ప్రాణాలకే ముప్పు.ఇక సాధు జంతువులకు అయితే ప్రతిరోజు ప్రాణగండమే.


ఎప్పుడు ఏ జీవి వచ్చి చంపేస్తుందో తెలీదు.అందుకే అవన్నీ అరచేతిలో ప్రాణాలు పెట్టుకుని బతుకుతాయి.
ఇక వేటకు సంబంధించిన వీడియోలు నిత్యం మనకు సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంటాయి.
నెట్టింట్లో వైరల్ అయ్యే వాటిల్లో ఎక్కువగా ఇలాంటి వేట వీడియోలో ఉంటాయి.ఇప్పుడు కూడా ఇలాంటి ఓ వేట వీడియో బాగా పాపులర్ అవుతోంది.
అయితే ఇది సాధారణ వేట వీడియో కాదండోయ్.మనం ఎక్కువగా చూసే వాటిల్లో పులి లేదా సింహం ఇతర జంతువులను చంపేసి తినడం మనం చూస్తుంటాం.
ఈ వీడియోలో కూడా ఓ సింహం ఇలాగే చేయాలనుకుంది.కానీ బెడిసి కొట్టింది.
ఎందుకంటే తల్లి ప్రేమ దాని తిక్క కుదిర్చింది.అడవిలో పిల్లల్ని కాపాడుకునేందుకు తల్లి జంతువులు ఎంతకు అయినా తెగిస్తాయి.
క్రూర మృగాలతో కూడా పోరాడుతాయి.ఇప్పుడు ఓ జిరాఫీ కూడా ఇలాంటి పనే చేసింది.
తన పిల్లల్ని తినాలని చూసిన సింహానికి ఇలాగే బుద్ధి చెప్పింది ఆ జిరాఫీ.
ఈ వైరల్ వీడియోలో నీటి కొలను దగ్గర పిల్ల జిరీఫీ గొయ్యిలో పడిపోతుంది.
ఇక దాన్ని కాపాడే క్రమంలో తల్లి జిరీఫీ కూడా మరో గొయ్యిలో పడిపోతుంది.
ఇక అదును చూసి సింహం పిల్ల జిరాఫీ మీద దాడి చేస్తుంది.దీంతో ఒక్క సారిగా తల్లి జిరాఫీ కోపానికి గురై వెంటనే బిడ్డ దగ్గరకు పరుగులు తీస్తుంది.
సింహాన్ని తన చేష్టలతో బెదిరించి తరిమేసింది.దీంతో కొద్ది సేపటికి ఆ పిల్ల జిరాఫీ లేచి నిలబడుతుంది.
దీంతో ఆ తల్లి జిరాఫీ ఆనందానికి అవధుల్లేకుండా పోతాయి.ఇందుకు సంబంధించిన వీడియో మీద చాలా రకాల కామెంట్లు వినిపిస్తున్నాయి.