వేసవిలో ఇద్దరిగా… శీతాకాలంలో ఒకరిగా దర్శనమిచ్చే శివలింగం ఎక్కడ ఉందో తెలుసా..?

వేసవిలో ఇద్దరు శీతాకాలంలో ఒకరిగా దర్శనమిచ్చే శివలింగమా? వినడానికి ఎంతో ఆశ్చర్యంగా ఉంది.

శివలింగం రెండుగా విడిపోవడం ఏంటి అని ఆశ్చర్యపోతున్నారా? ఇది నిజం.మన భారతదేశంలో ఎన్నో ప్రసిద్ధి చెందిన దేవాలయాలు మనకు దర్శనమిస్తాయి.

అలాంటి ప్రసిద్ధి చెందిన దేవాలయాలలో ఎన్నో వింతలు విశేషాలు చోటుచేసుకున్నాయి.అలాంటి వింతలు కలిగిన ఆలయాలలో హిమాచల్ ప్రదేశ్ లోని కాంగ్రాలో ఉన్న శివాలయం ఒకటి అని చెప్పవచ్చు.

ఈ ఆలయంలో శివపార్వతుల ఇద్దరు కలిసి భక్తులకు దర్శనం ఇస్తారు.అయితే ఈ ఆలయం ప్రత్యేకతలు ఏమిటి ఎందుకు శివలింగం రెండుగా మారుతుంది అనే విషయాల గురించి ఇక్కడ తెలుసుకుందాం.

ఈ ఆలయంలో శివలింగం రెండు భాగాలుగా మనకు దర్శనమిస్తుంది.పెద్దగా ఉన్న లింగాన్ని శివుడుగా భావిస్తారు.

అదేవిధంగా చిన్నగా ఉన్న లింగాన్ని పార్వతీదేవిగా కొలుస్తారు.శివుడి లింగం ఎనిమిది అడుగుల పొడవు ఉండగా పార్వతి లింగం ఆరడుగుల పొడవు ఉంటుంది.

ఈ ఆలయంలోని శివలింగం అష్టభుజి.అయితే ఒకానొక సమయంలో ఈ ఆలయంలో ఎంతో వింత చోటుచేసుకుంది.

ఈ ఆలయంలో కొలువై ఉన్న స్వామి వారు కాలానుగుణంగా మార్పు చెందుతారు.వేసవికాలంలో ఇక్కడ ఉన్న శివలింగం రెండుగా చీలి పార్వతీపరమేశ్వరులుగా పూజలందుకుంటారు.

అదేవిధంగా శీతాకాలంలో రెండు లింగాలు ఏకమై అర్థనారీశ్వరుడుగా భక్తులకు దర్శనం కల్పిస్తారు.పురాణాల ప్రకారం బ్రహ్మ ,విష్ణు నేను గొప్ప అంటే నేను గొప్ప అని వితండవాదంతో పోటీ పడుతూ ఇద్దరిమధ్య మాటల యుద్ధం చోటు చేసుకుంది.

వీరిద్దరి మధ్య మాటా మాటా పెరిగి చివరికి యుద్ధం చేయడానికి సిద్ధం అవుతారు.

ఆ సమయంలో పరమేశ్వరుడు వచ్చి వీరిద్దరి మధ్య అగ్ని స్తంభంగా నిలబడి అగ్ని స్తంభం ఏమిటో తెలియజేయాలని అడిగారు.

ఇద్దరు కూడా అది అంతం అని కనిపెట్ట లేకపోవడంతో ఇద్దరు యదా స్థానానికి చేరుకుంటారు.

ఆ సమయంలో బ్రహ్మదేవుడు సాక్ష్యంగా మొగలి పువ్వులు తీసుకుని వచ్చాడు.బ్రహ్మ, విష్ణు రాజీ పడడంతో అగ్ని స్తంభంగా ఏర్పడిన పరమేశ్వరుడు నిజస్వరూపంలోకి బ్రహ్మ, విష్ణువులకు ఈ ప్రాంతంలోనే దర్శనమిచ్చాడని పురాణాలు చెబుతున్నాయి.

అందుకే ఈ ప్రాంతంలోని పరమేశ్వరుడి ఆలయం కొలువై ఉందని స్థలపురాణం చెబుతోంది.

మోదీ సభకు చంద్రబాబు దూరం.. కారణం ఏంటంటే ..?