ఉద్యమ నేతలు మరోసారి ఐక్యం కావాలి.. ప్రొ.కోదండరాం
TeluguStop.com
తెలంగాణలో పాలన కార్పొరేట్ మయంగా మారిందని తెలంగాణ జనసమితి అధ్యక్షుడు ప్రొ.కోదండరామ్ అన్నారు.
నిరంకుశ పాలనను అంతం చేయడానికి పోరాటం చేస్తామని తెలిపారు.ఈ నేపథ్యంలో తెలంగాణ ఉద్యమ నేతలు అంతా మరోసారి ఐక్యం కావాలని సూచించారు.
ఈనెల 25వ తేదీన నిర్వహించే ఉద్యమ జాతరకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోదండరాం కోరారు.
రాష్ట్రంలో పోడు భూములు, ధరణి సమస్యల పోరాటానికి ఐక్యం కావాలని పిలుపునిచ్చారు.ఇళ్లు, వృద్ధుల పెన్షన్లపై ప్రభుత్వం శ్వేతపత్రం విడుదల చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
అమెరికాలో అక్రమ నివాసం .. 18000 వేల మంది భారతీయుల బహిష్కరణకు ఏర్పాట్లు