చిన్న హీరోకి వచ్చినన్ని వ్యూస్ ని కూడా రాబట్టలేకపోయిన ‘గుంటూరు కారం’ లేటెస్ట్ సాంగ్!

సూపర్ స్టార్ మహేష్ బాబు ( Mahesh Babu )మరియు త్రివిక్రమ్ కాంబినేషన్ లో ఒక మాస్ కమర్షియల్ ఎంటర్టైనర్ తెరకెక్కబోతుంది అని ప్రకటన రాగానే ఫ్యాన్స్ నుండి ఆడియన్స్ వరకు ఈ క్రేజీ ప్రాజెక్ట్ పై అంచనాలను ఒక రేంజ్ లో పెట్టుకున్నారు.

ఎందుకంటే త్రివిక్రమ్ వరుస సూపర్ హిట్స్ లో ఉన్నాడు, మహేష్ కూడా అదే ఫామ్ లో ఉన్నాడు.

వీళ్లిద్దరి కాంబినేషన్ లో గతం లో వచ్చిన అతడు మరియు ఖలేజా చిత్రాలు క్లాసిక్స్ గా నిలిచాయి.

అందుకే ఈ ప్రాజెక్ట్ ని ప్రకటించిన రోజు నుండే బిజినెస్ ఆఫర్స్ వేరే లెవెల్ లో వచ్చాయి.

టైటిల్ పెట్టే ముందే అన్నీ ప్రాంతాలకు చెందిన బిజినెస్ పూర్తి అయిపోయింది.'గుంటూరు కారం( Guntur Kaaram )' ప్రారంభం లో ఆ రేంజ్ లో హైప్ ఉండేది.

కానీ ఇప్పుడు ఆ హైప్ మొత్తం గాలిలో కలిసిపోయిందా అంటే అవుననే అంటున్నారు విశ్లేషకులు.

"""/" / ఇప్పటి వరకు ఈ చిత్రం నుండి విడుదలైన ప్రమోషనల్ కంటెంట్ కి యూట్యూబ్ లో యాడ్స్ ఒక రేంజ్ లో వాడారు.

ఆ యాడ్స్ వల్ల వచ్చిన వ్యూస్ తప్ప, ఈ సినిమా ప్రమోషనల్ కంటెంట్ కి వచ్చిన నిజమైన వ్యూస్ చాలా తక్కువ.

మొదటి లిరికల్ వీడియో సాంగ్ 'ధమ్ మసాలా బిర్యానీ' అనే పాటకి యాడ్స్ ద్వారానే అధిక వ్యూస్ వచ్చాయి.

ఇక రీసెంట్ గా విడుదలైన రెండవ పాట 'ఓ మై బేబీ' పాటకి యూట్యూబ్ లో యాడ్స్ పెట్టలేదు.

అందువల్ల ఈ పాటకి కేవలం 27 లక్షల వ్యూస్ మాత్రమే వచ్చాయి.ఇది ఒక స్టార్ హీరో సినిమా పాట కి చాలా అంటే చాలా తక్కువ వ్యూస్ అనే చెప్పాలి.

మీడియం రేంజ్ హీరో సినిమా పాటలకు కూడా మినిమం మూడు మిలియన్ వ్యూస్ వస్తున్నా ఈరోజుల్లో మహేష్ - త్రివిక్రమ్ కాంబినేషన్ లో వచ్చిన సినిమా పాటకి ఇంత తక్కువ వ్యూస్ రావడం అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తున్న విషయం.

"""/" / ఈ పాట విడుదలైనప్పుడే థమన్ పై మహేష్ బాబు ఫ్యాన్స్ ఒక రేంజ్ లో విరుచుకుపడ్డారు.

ఒక క్రేజీ కాంబినేషన్ లో వచ్చే సినిమాకి కంపోజ్ చెయ్యాల్సిన పాట ఇదేనా?, నీకు చేతకాకపోతే సినిమా నుండి తప్పుకోవచ్చు కదా అని థమన్ ని ఇష్టమొచ్చినట్టు తిట్టేస్తున్నారు మహేష్ ఫ్యాన్స్.

ఇకపోతే నిన్న ఈ పాట విడుదలైన సమయం లోనే ప్రభాస్ 'సలార్' చిత్రం నుండి 'సూరీడు' అనే పాట విడుదలైంది.

ఈ పాటకి మంచి రెస్పాన్స్ రావడమే కాదు, యూట్యూబ్ లో 24 గంటల్లో 5 మిలియన్ కి పైగా వ్యూస్ వచ్చాయి.

టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్ పేరు మారిందా.. వైరల్ అవుతున్న వార్తల్లో నిజమిదే!