బొట్టు పెట్టి…ఓట్లు అభ్యర్థించిన తాజా మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు ఒగ్గు రజిత యాదవ్.

రాజన్న సిరిసిల్ల జిల్లా:కాంగ్రెస్ పార్టీ బలపరిచిన కరీంనగర్ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్ రావు( Velichala Rajender Rao) ను గెలిపించాలని కోరుతూ స్థానిక తాజా మాజీ ఉప సర్పంచ్ కాంగ్రెస్ నాయకురాలు ఒగ్గు రజిత యాదవ్ కిష్టంపల్లి,కిషన్ దాస్ పేట,గాంధీ ఏరియా లో చేతి గుర్తుకు ఓటు వేసి వెలిచాల రాజేందర్ రావు ను గెలిపించాలని కోరుతూ ఇంటింటికీ వెళ్లి మహిళలకు బొట్టు పెట్టి ఓట్లు అభ్యర్థించారు.

ఈ సందర్భంగా రజిత యాదవ్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ మహిళలకు ఉచిత బస్ సౌకర్యం, 10 లక్షల ఉచిత ఆరోగ్య బీమా( Free Health Insurance ) తదితర ఆరు గ్యారంటీ స్కీం లు పక్కగా అమలు చేయడం జరుగుతుందనీ పక్కగా పథకాలు అమలు అవుతున్నాయని తాజా మాజీ ఉప సర్పంచ్ ఒగ్గు రజిత యాదవ్ అన్నారు.

కిష్టంపల్లి నుండి గాంధీ వరకు ఎన్నికల ప్రచారం నిర్వహించారు.ఈ ఎన్నికల ప్రచారంలో తాజా మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి,గన్న మల్లారెడ్డి కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి వంగ గిరిధర్ రెడ్డి, పట్టణ శాఖ అద్యక్షులు చెన్ని బాబు,తాజా మాజీ ఎంపీటీసీ ఒగ్గు బాలరాజు యాదవ్,మిర్యాల్ కార్ చందు,గంట ఆంజాగౌడ్, పందిర్ల శ్రీనివాస్ గౌడ్, గంట వెంకటేష్ గౌడ్ తో పాటు 150 మంది మహిళలు పాల్గొన్నారు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో మహేష్ కొడుకు, కూతురు సత్తా చాటడం పక్కా.. ఇద్దరూ ఇద్దరే అంటూ?