ప్రకాష్ రాజ్ పొలిటికల్ ఎంట్రీ పై సరికొత్త ప్రచారం... అదేంటంటే?

తెలంగాణ రాజకీయాలు రోజుకో మలుపు తిరుగుతూ ఒక్కసారిగా రాజకీయ వాతావరణాన్ని వేడెక్కుతున్న పరిస్థితి ఉంది.

అయితే కొన్ని రోజుల క్రితం ఉద్దవ్ థాక్రేను కేసీఆర్ కలిసిన సందర్బంలో ప్రకాష్ రాజ్ అక్కడే ఉండటంతో ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో ఎంతగా చర్చ జరిగిందో మనకు తెలిసిందే.

అయితే ఇక ఆ తరువాత కేసీఆర్ తో తరచూ కనిపిస్తుండటంతో ఇక టీఆర్ఎస్ లో ప్రకాష్ రాజ్ చేరబోతున్నా రంటూ ఒక ప్రచారం రాజకీయ వర్గాల్లో విస్తృతంగా జరుగు తోంది.

అయితే ఈ ప్రచారాన్ని ఇటు టీఆర్ఎస్ పార్టీ ఖండించిన పరిస్థితి కాని,  ఇటు ప్రకాష్ రాజ్ కూడా స్పందించిన పరిస్థితి లేదు.

అయితే ప్రస్తుతం రాజకీయ వర్గాలలో జరుగుతున్న ప్రచారం ఏమిటంటే ప్రకాశ్ రాజ్ గజ్వేల్ నుండి పోటీ చేసే అవకాశం ఉందనే ఒక ప్రచారం సాగుతోంది.

అయితే ఇక్కడ మనకు ఒక అనుమానం వచ్చే అవకాశం ఉంది.అదేమిటంటే గజ్వేల్ నుండి కేసీఆర్ కదా పోటీ చేసేది మరి కేసీఆర్ ఎక్కడి నుండి పోటీ చేస్తాడనే అనుమానం వస్తుంది కదా.

అయితే ఈ సారి యాదాద్రి  నుండి కేసీఆర్ పోటీ చేసే అవకాశం ఉందనేది ఒక ప్రచారం నడుస్తోంది.

ఈ విషయం పట్ల ఇప్పటికిప్పుడు దీనిపై ఒక స్పష్టమైన సమాధానం అనేది రాకున్నా రానున్న రోజుల్లో ఎన్నికల సమయంలో పూర్తి క్లారిటీ అనేది వచ్చే అవాకాశం కనిపిస్తోంది.

ఏది ఏమైనా కేసీఆర్ వ్యూహాలను అంచనా వేయడం చాలా కష్టమైన విషయం అయినప్పటికీ అవరోధాలను తనకు అనుకూలంగా మార్చుకోవడం లో మాత్రం కేసీఆర్ సిద్దహస్తుడు అనే విషయం మనకు తెలిసిందే.

మరి ప్రకాష్ రాజ్ రానున్న రోజుల్లో తెలంగాణ రాజకీయాల్లో ఏ మేరకు కీలక పాత్ర పోషిస్తాడనేది ప్రస్తుతం అసక్తిగా మారింది.

క‌ల్తీ నెయ్యిని గుర్తించేందుకు ఈ సింపుల్ టిప్స్ ను ఫాలో అవ్వండి..!