అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షుని పాడె మోసిన మాజీ సర్పంచ్ దగ్గరుండి అంత్యక్రియలు

రాజన్న సిరిసిల్ల జిల్లా( Rajanna Sirisilla District) ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన అంబేద్కర్ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు గడ్డం నరయ్య (80 ) అనారోగ్యంతో చనిపోయిన ఘటన ఎల్లారెడ్డిపేట మండల కేంద్రంలో జరిగింది.

అయితే సోమవారం జరిగిన అంత్యక్రియలలో ఎల్లారెడ్డిపేట మాజీ సర్పంచ్ నేవూరి వెంకట్ రెడ్డి( Nevuri Venkat Reddy ) పాల్గొని తుది వీడ్కోలు పలికారు అంతిమయాత్ర ప్రారంభం కావడం, నేవూరి వెంకట్ రెడ్డి, తదితర నాయకులు పాడె మోయడం చూసిన గ్రామస్తులు, ఒక్కసారిగా భావోద్వేగానికి గురయ్యారు.

అత్యంత సన్నిహితుడైన గడ్డం నర్సయ్య మరణవార్త తెలుసుకుని హైదరాబాద్ నుంచి వచ్చిన వెంకట్ రెడ్డి అన్నీ దగ్గరుండి కుటుంబ సభ్యలను అతని దత్త పుత్రుడైన గడ్డం జితేందర్ కు అండగా నిలిచారు.

డెడ్ బాడీని కరీంనగర్ ఆసుపత్రి నుంచి ఎల్లారెడ్డిపేట తరలించడం, అంతిమ యాత్ర నిర్వహించడం వరకు దగ్గరుండి పర్యవేక్షించి సానుభూతి వ్యక్తం చేశారు.

అత్యంత సన్నిహితుడైన నర్సయ్య ను కోల్పోయినానని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు.

నర్సయ్య మృతదేహాన్ని బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు ఆగయ్య, మాజీ ఎంపీటీసీ ఓగ్గు బాలరాజు యాదవ్, మాజీ వార్డు సభ్యులు పందిర్ల శ్రీనివాస్ గౌడ్( Srinivas Goud ) లు సందర్శించి నివాళులర్పించారు.

కుటుంబ సభ్యులకు ప్రగాఢ సంతాపం తెలిపారు.

తెలంగాణ దశాబ్ద ఆవిర్భావ వేడుకలు.. కేసీఆర్ కు ఇన్విటేషన్..!!