ఉత్తరప్రదేశ్ లో నేడు ఆఖరి విడత పోలింగ్..!!

దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన ఉత్తర ప్రదేశ్ లో అసెంబ్లీ ఎన్నికలు జరుగుతున్న సంగతి తెలిసిందే.

మొత్తం ఏడు విడుతలలో.ఎన్నికలు జరుగుతుండగా ఇప్పటివరకు 6 దశల ఎన్నికలు విజయవంతంగా ముగిశాయి.

నేడు చివరి దశ.ఏడో దశ పోలింగ్ స్టార్ట్ అయింది.

ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ నిర్వహించనున్నారు.

దాదాపు తొమ్మిది జిల్లాల్లో 54 అసెంబ్లీ స్థానాలకు ఎలక్షన్ కమిషన్ ఎన్నికలు నిర్వహిస్తోంది.

/br మొత్తం 613 మంది అభ్యర్థులు పోటీలో ఉన్నారు.జరుగుతున్న ఈ తొమ్మిది జిల్లాలలో చాలావరకు పోటాపోటీ బీజేపీ వర్సెస్ సమాజ్ వాదీ పార్టీ భాగస్వామ్య పక్షాల మధ్య ఉండనున్నట్లు సమాచారం.

 ఎన్నికలు చాలా హోరాహోరీగా సాగుతున్నాయి.దేశంలోనే అత్యధిక అసెంబ్లీ నియోజకవర్గాలు కలిగిన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో.

ఎవరు గెలుస్తారు అన్నది ఇప్పుడు చాలా సస్పెన్స్ గా మారింది.ఇక్కడ నిర్వహించిన సర్వేలలో అయితే బిజెపి లేదా సమాజ్వాది పార్టీ అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు ఫలితాలు వచ్చాయి.

ప్రస్తుతం యూపీలో బీజేపీ అధికారంలో ఉంది.

దేవర రిజల్ట్ ఏంటి..? కొరటాల ఎన్టీయార్ కి మరో సక్సెస్ ఇచ్చాడా..?