దివాళా అంచుల్లో దేశంలోని అతిపెద్ద సంస్థ.. ?

ఓడలు బండ్లు అవుతాయి, బండ్లు ఓడలు అవుతాయని పెద్దలు అన్న మాటలు అబద్ధం కాదని పలు సందర్భాల్లో తెలిసిందే.

ఇకపోతే కాలం అనేది ఎప్పుడు ఒకేలా ఉండదు.ఎందుకంటే ఒక వెలుగు వెలిగిన సంస్దలు కనుమరుగై కాలగర్భంలో కలసిపోయిన రోజులు ఉన్నాయి.

ఇకపోతే ప్రస్తుతం దేశంలోని అతిపెద్ద కాఫీ ఉత్పత్తుల విక్రయ సంస్థగా పేరు గాంచిన కేఫ్ కాఫీ డే ప్రస్తుతం దివాళా అంచుల్లో ఉందట.

పుట్టెడు అప్పులో కూరుకుపోయిన కాఫీ డే ఎంటర్‌ప్రైజెస్ 2021 మార్చి నాటికి రుణ వాయిదాలను చెల్లించచడంలో విఫలమైందట.

కాగా అప్పులిచ్చిన బ్యాంకర్లు, ఆర్థిక సంస్థలు కేఫ్ కాఫీ డేపై నేషనల్ కంపెనీ లా ట్రెబ్యునల్ కు పిటిషన్ దాఖలు చేసినట్టు సమాచారం.

ఇప్పటికే కాఫీ డే షేర్ల ట్రేడింగ్‌ను స్టాక్ ఎక్స్ఛేంజీలు కార్పొరేట్ గవర్నెన్స్ నిబంధనలను పాటించలేదని రద్దు చేశాయి.

అంతే కాకుండా ఈ సంస్దను బ్రతికించడానికి టాటా గ్రూపుతో జరిపిన చర్చలు కూడా విఫలం అయ్యాయట.

ఇక కాఫీ డే సంస్థ వ్యవస్థాపకుడు వీ జీ సిద్ధార్థ అనుకోని పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోవడంతో ఈ సంస్థ తీవ్ర సమస్యలను ఎదుర్కొంటూ వస్తుంది.

ఈ క్రమంలో పూర్తిగా దివాళ తీసిందని తెలుస్తుంది.

పిగ్మెంటేషన్ మ‌చ్చ‌లు ముఖంపై అస‌హ్యంగా క‌నిపిస్తున్నాయా.. ఇలా వ‌దిలించుకోండి!