జూనియర్ మహిళా డాక్టర్ మౌమిత హంతకులను కఠినంగా శిక్షించాలి

సూర్యాపేట జిల్లా:ఆగస్టు 9వ తేదీన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలోని ఆర్జికర్ మెడికల్ కాలేజీలో జూనియర్ డాక్టర్ గా విధులు నిర్వహిస్తున్న మౌమితను తోటి డాక్టర్లు సభ్య సమాజం తలదించుకునే విధంగా అత్యంత అమానుషంగా అత్యాచారం చేసి,పాశవికంగా హత్య చేసిన మానవ మృగాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ పిఓడబ్ల్యూ ఆధ్వర్యంలో సోమవారం సూర్యాపేట జిల్లా ఆత్మకూర్ (ఎస్) మండలం చిల్పకుంట్ల మెయిన్ రోడ్ లో నిరసన వ్యక్తం చేశారు.

ఈ సందర్భముగా ఐ.ఎఫ్.

టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు,పిఓడబ్ల్యూ జిల్లా సహాయ కార్యదర్శి పులుసు సుజాత మాట్లాడుతూ 78 సంవత్సరాల స్వతంత్ర భారతావనిలొ మహిళలకు, విద్యార్థినిలకు రక్షణ లేకుండా పోయిందని,దేశంలోని ప్రతిరోజూ మహిళలపై అత్యాచారాలు,మానభంగాలు,హింస,దాడులు జరుగుతున్నాయని,వీటిని అరికట్టడంలో మోడీ ప్రభుత్వం వైఫల్యం చెందిందన్నారు.

మహిళా రక్షణ కోసం నిర్భయ లాంటి చట్టాలు తీసుకువచ్చినప్పటికీ పునరావతం అవుతూనే ఉన్నాయన్నారు.

సామ్రజ్య వాద విష సంస్కృతిని,ఆ భావజాలాన్ని అరికట్టాలని, అప్పుడే కొంత మార్పు తీసాకరాగులుగుతామని చెప్పారు.

దాడులు చేసిన వారిని భౌతికంగా ఎన్కౌంటర్ చేసిన ఎలాంటి మార్పు రావడం లేదని ఆచరణలో రుజువు అయ్యిందని ఆవేదన వ్యక్తం చేశారు.

అన్ని రంగాలలో మహిళలకు రక్షణ కరువైందని, చివరికి ప్రజల ప్రాణాలను కాపాడుతున్న డాక్టర్లకి రక్షణ లేకుండా పోయిందని,మౌమిత మృతిపై సుప్రీంకోర్టు జడ్జి చేత న్యాయ విచారణ చేపట్టాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో పిఓడబ్ల్యూ జిల్లా కార్యవర్గ సభ్యురాలు కూసు జయసుధ,మున్న సుగుణమ్మ,మున్న వెంకమ్మ, జటంగి లింగమ్మ, ఉప్పుల రామతార,మున్న సోమమ్మ, కుసు వెంకటమ్మ,కుసు రామతార,గ్రామ అఖిల భారత రైతు కూలీ సంఘం నాయకులు దగ్గుల మల్లయ్య, కూసు వెంకటయ్య, ఉప్పునూతల మల్సూరు, యలమకంటి సత్తయ్య,కూసు వెంకన్న తదితరులు పాల్గొన్నారు పాల్గొన్నారు.

హర్ష సాయి మరో సంచలన ఆడియో.. బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ ను సమర్ధించుకుంటున్న హర్ష?