కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం.. డబ్ల్యూఎఫ్ఏ కొత్త ప్యానెల్ సస్పెండ్

కేంద్ర క్రీడాశాఖ కీలక నిర్ణయం తీసుకుంది.భారత రెజ్లర్లు చేస్తున్న ఆందోళనల నేపథ్యంలో భారత రెజ్లింగ్ సమాఖ్య కొత్త ప్యానెల్ ను సస్పెండ్ చేసింది.

బ్రిజ్ భూషణ్ కు కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ అత్యంత నమ్మకస్తుడని తెలుస్తోంది.

దీంతో కొత్త ప్యానెల్ పై కేంద్ర క్రీడాశాఖ సస్పెన్షన్ వేటు వేసింది.సంజయ్ సింగ్ ఎన్నికలను నిరసిస్తూ ఇప్పటికే రెజ్లర్ సాక్షి మాలిక్ రిటైర్మెంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే.

అయితే గతంలో మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధిస్తున్నారన్న ఆరోపణల నేపథ్యంలో డబ్ల్యూఎఫ్ఏ అధ్యక్షుడిగా ఉన్న బ్రిజ్ భూషణ్ ను కేంద్ర క్రీడాశాఖ సస్పెండ్ చేసిన సంగతి తెలిసిందే.

కొత్తగా ఎన్నికైన అధ్యక్షుడు సంజయ్ సింగ్ కూడా బ్రిజ్ భూషణ్ నమ్మకస్తుడు, అనుచరుడని రెజ్లర్లు మరోసారి ఆందోళనలు చేస్తున్నారు.

రుణమాఫీపై తీపి కబురు అందేనా…?