దేశం మొత్తం సూపర్ హిట్.. అక్కడ మాత్రం పట్టించుకోరేం?
TeluguStop.com
ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమా సూపర్ హిట్ టాక్ ని దక్కించుకుని ఏకంగా రూ.
200 కోట్ల వసూళ్లకు పైగా రాబట్టిన విషయం తెల్సిందే.వివాదాస్పద అంశం అవ్వడం వల్ల ది కేరళ స్టోరీ సినిమాను చూసేందుకు చాలా మంది ఆసక్తి చూపించారు.
చాలా రాష్ట్రాల్లో సినిమాను కనీసం రిలీజ్ కూడా చేయలేదు.అక్కడ రిలీజ్ కు అనుమతించాలని డిమాండ్ వినిపిస్తుంది.
అంతే కాకుండా దేశం మొత్తం కూడా ది కేరళ స్టోరీ సినిమా ను మరిన్ని రోజుల పాటు ప్రదర్శించాలని మేకర్స్ భావిస్తున్నారు.
తమిళనాడు తో పాటు పశ్చిమబెంగాల్ ( West Bengal )లో సినిమాను విడుదలకు ముందే బ్యాన్ చేయడంతో అక్కడ సినిమా రిలీజ్ అవ్వలేదు.
దాంతో కోర్టుకు( Court ) వెళ్లిన మేకర్స్ అక్కడ రిలీజ్ కు అనుమతులు తెచ్చుకోవడం జరిగింది.
అంతా బాగానే ఉంది బెంగాల్ లో రిలీజ్ కు అంతా సిద్ధం అనుకుంటున్న సమయంలో అనూహ్యంగా అక్కడ ప్రభుత్వం అనధికారికంగా షాక్ ఇచ్చింది.
"""/" /
కోర్టు విడుదలకు అనుమతించాలని రాష్ట్ర ప్రభుత్వంను ఆదేశించింది.దాంతో తప్పని పరిస్థితుల్లో రాష్ట్ర ప్రభుత్వం విడుదలకు ఓకే చెప్పింది.
అదే సమయంలో అక్కడి వారితో మాట్లాడి సినిమాను ఎక్కువ రిలీజ్ కాకుండా ప్లాన్ చేశారు.
బెంగాల్ లో విడుదల అయ్యింది అనిపించేందుకు రాష్ట్రం మొత్తం ఒకే ఒక్క థియేటర్ లో విడుదల చేయడం జరిగిందట.
ఇప్పుడు అదే మేకర్స్ కు కోపంను తెచ్చి పెట్టింది.కోర్టు అనుమతించినా కూడా ఇలా చేయడం ఎంత వరకు కరెక్ట్ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
""img / మొత్తానికి దేశం మొత్తం కూడా కేరళ స్టోరీ ని సక్సెస్ చేస్తే బెంగాల్ ప్రజలు మాత్రం కనీసం చూడ్డానికి కూడా వీలు లేకుండా పోయింది అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
దేశం లోనే కాకుండా ఇతర దేశాల్లో కూడా ది కేరళ స్టోరీ సినిమా స్క్రీనింగ్ అవుతుంది.
కానీ పశ్చిమబెంగాల్ లో రాజకీయాల కారణంగా స్క్రీనింగ్ అవ్వడం లేదు అంటూ ఫిల్మ్ మేకర్స్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
రొమేనియాలో షాకింగ్ ఘటన.. మహిళా యజమానిని పీక్కుతిన్న పెంపుడు కుక్కలు..