రూ. 250 కోట్లు రాబట్టిన హీరోయిన్‌ ను పట్టించుకోని ఫిల్మ్‌ మేకర్స్‌

తెలుగు లో హార్ట్‌ ఎటాక్ అనే సినిమా లో హీరోయిన్ గా నటించిన అదా శర్మ ( Ada Sharma) ఇండస్ట్రీకి పరిచయం అయ్యింది.

మొదటి సినిమా తోనే ఫెయిల్యూర్‌ ను చవి చూసినా కూడా అదృష్టం కొద్ది సినిమా ఇండస్ట్రీలోనే కొనసాగుతూ ఉంది.

గత కొన్ని సంవత్సరాలుగా అదా శర్మ అడపా దడపా సినిమా ల్లో నటిస్తోంది.

కొన్ని ఐటం సాంగ్స్ లో అలరించింది.కానీ ఇప్పటి వరకు ఈమె యొక్క స్టార్ డమ్‌ మాత్రం ఎక్కడ వేసిన గొంగలి అక్కడే అన్నట్లుగా ఉంది.

"""/" / ఏమాత్రం ఆకట్టుకోలేక పోయింది.అంతే కాకుండా ఈ మధ్య ఈమెకు సినిమా ల్లో అవకాశాలు రావడమే గగనం అయ్యింది.

అలాంటి సమయంలో అనూహ్యంగా ది కేరళ స్టోరీ( The Kerala Story ) సినిమా లో నటించే అవకాశం దక్కించుకుంది.

ఒక హిందూ అమ్మాయి ని మతం మార్పించి ఎలా ఉగ్రవాదంలోకి దించారు అనేది సినిమా కథ.

ఈ పాత్ర కు నటన అత్యంత కీలకం.ఆ నటన అదా శర్మ అద్భుతంగా చేసింది.

అన్ని విధాలుగా కూడా అదా శర్మ వావ్ అనిపించింది అనడంలో సందేహం లేదు.

ఆకట్టుకునే అందంతో పాటు గతంలో స్కిన్ షో( Skin Show ) చేసిన సినిమాలు పెద్దగా ఆడలేదు.

"""/" / కానీ ఈ మధ్య కాలంలో ఈమె చేసిన కేరళ స్టోరీ సినిమా మాత్రం సూపర్‌ హిట్‌ గా నిలిచింది.

ఏకంగా 250 కోట్ల రూపాయల వసూళ్లు దక్కించుకున్న నేపథ్యం లో అదా శర్మ యొక్క క్రేజ్ అమాంతం పెరిగింది.

కానీ తెలుగు ఫిల్మ్ మేకర్స్ ( Telugu Filmmakers )మాత్రం ఇంకా కూడా ఆమెను పట్టించుకోవడం లేదు.

అదుగో ఇదుగో అంటూ ఆమె మళ్లీ ఆఫర్ల కోసం వెతుక్కోవాల్సిన పరిస్థితి కనిపిస్తుంది.

ఇక ముందు అయినా ఆమె వరుసగా సినిమా ల్లో నటిస్తుందేమో చూడాలి.భారీ అంచనాల నడుమ రూపొందిన స్టార్‌ హీరోల సినిమాలకు అదా శర్మ ఎలాగూ వాంటెడ్‌ అవ్వదు.

కనుక కనీసం చిన్న హీరోల సినిమా లు లేదా లేడీ ఓరియంటెడ్‌ సినిమా లకు అయినా అదా శర్మ ను ఫిల్మ్‌ మేకర్స్ పట్టించుకోవాలని ఆమె అభిమానులు విజ్ఞప్తి చేస్తున్నారు.

బ్రెజిల్ జాతీయ చిహ్నం ఈ కుక్కలే.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!