కవితక్క తిప్పలు.. కే‌సి‌ఆర్ కు చిక్కులు ?

బి‌ఆర్‌ఎస్ నాయకురాలు ఎమ్మెల్సీ కవిత( Mlc Kavitha ) గత కొన్నాళ్లుగా డిల్లీ లిక్కర్ స్కామ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న సంగతి తెలిసిందే.

దేశ వ్యాప్తంగా సంచలనంగా మారిన ఈ లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే పలువురు అరెస్ట్ అయ్యారు.

ఈ కేసులో కవిత కూడా అరెస్ట్ అవుతుందని బీజేపీ నేతలు మొదటి నుంచి గట్టిగానే చెబుతున్నారు.

వారి వ్యాఖ్యలకు తగ్గట్లుగానే కవితా ఇప్పటివరకు మూడు సార్లు ఈడీ విచారణకు కవిత హాజరు కావడంతో జైలుకు పోవడం ఖాయమే అనే వాదన కూడా నదించింది.

అయితే మార్చి 20 తేదీ తరువాత నుంచి ఏమైందో తెలియదు గాని ఈ కేసు ఒక్కసారిగా సైలెంట్ అయింది.

"""/" / దాంతో కవిత ను కక్ష పూరితంగానే లిక్కర్ స్కామ్( Delhi Liquor Scam ) ఇరికించే ప్రయత్నం జరుగుతోందా అనే వాదన బలపడుతూ వచ్చింది.

అయితే తాజాగా ఈ కేసు మరోసారి కీలక మలుపు తిరిగింది.ఈడీ దాఖలు చేసిన అనుబంధ చార్జి షీట్ లో కవితా పేరును ప్రస్తావించింది దర్యాప్తు సంస్థ.

అంతే కాకుండా ఆమె బినామిగా అరుణ్ పిళ్లై( Arun Pillai )పని చేశారని.

"""/" / డిల్లీ లిక్కర్ స్కామ్ లో వచ్చిన లాభాలతో కవితా భూములు కొనుగోలు చేశారని తాజా ఛార్జీ షీట్ లో ఈడీ పేర్కొంది.

దీంతో మరోసారి ఈ లిక్కర్ స్కామ్ తెలంగాణలో హాట్ టాపిక్ అయింది.తాజా ఛార్జీ షీట్ ను బట్టి ఎమ్మెల్సీ కవిత మరోసారి ఈడీ విచారణ ఎదుర్కొనే అవకాశం ఉన్నట్లు విశ్లేషకులు చెబుతున్నారు.

"""/" / అయితే ఈసారి విచారణ జరగాల్సి వస్తే కవితా అరెస్ట్ అయ్యే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయనే వాదన కూడా వినిపిస్తోంది.

అయితే తాను అరెస్ట్ కు కూడా సిద్దమని, చివరకు న్యాయమే గెలుస్తుందని కవిత గతంలోనే ప్రకటించారు.

మొత్తానికి డిల్లీ లిక్కర్ స్కామ్ చిక్కులు ఎమ్మెల్సీ కవితను ఇప్పుడప్పుడే వీడేలా కనిపించడంలేదు.

మరి ఒకవేళ కవిత అరెస్ట్ అయితే కే‌సి‌ఆర్( CM KCR ) తదుపరి ప్లాన్ ఏంటి అనేది కూడా ఆసక్తికరంగా మారింది.

తప్పు చేసిన వారు తప్పకుండా జైలు కు వెలతారని ఆ మద్య తెలంగాణ వచ్చిన ప్రధాని మోడీ, అమిత్ షా ఘంటాపథంగా చెప్పుకొచ్చారు.

ఇప్పుడు తాజా ఛార్జీ షీట్ లో కవిత పేరు ప్రస్తావించడంతో అరెస్ట్ తప్పదా ? అనే సందేహాలు వ్యక్తమౌతున్నాయి.

వెట్రిమారన్ డైరెక్షన్ లో అవసరమా తారక్.. ఈ సినిమా రిజల్ట్ చూసైనా మారతావా?