రాధేశ్యామ్ సినిమాకు చుక్కలు చూపిస్తున్న చిన్న సినిమా.. రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధిస్తూ?

పాన్ ఇండియా మూవీగా 300 కోట్ల రూపాయల భారీ బడ్జెట్ తో టాప్ టెక్నీషియన్లు పని చేసి రాధేశ్యామ్ సినిమాను తెరకెక్కించిన సంగతి తెలిసిందే.

బాహుబలి2 సినిమా సమయంలోనే ప్రభాస్ ఈ సినిమాకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వగా వేర్వేరు కారణాల వల్ల నాలుగేళ్లు షూటింగ్ జరుపుకున్న ఈ సినిమా థియేటర్లలో విడుదలై ఫ్లాప్ గా నిలిచింది.

ఫస్ట్ వీకెండ్ లో రికార్డు స్థాయిలో కలెక్షన్లు సాధించిన రాధేశ్యామ్ సోమవారం కలెక్షన్లు దారుణంగా ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల థియేటర్ల నుంచి మరే సినిమా ద్వారా పోటీ లేక పోయినా ఈ సినిమా కలెక్షన్లు పుంజుకోవడం కష్టమేనని తెలుస్తోంది.

ఫుల్ రన్ లో ఈ సినిమా 100 కోట్ల రూపాయల షేర్ కలెక్షన్లను సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ఈ సినిమా నిర్మాతలకు భారీగా నష్టాలు తప్పవని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.బాలీవుడ్ లో రాధేశ్యామ్ సినిమాకు కలెక్షన్లు తగ్గడానికి మరో ముఖ్యమైన కారణం ఉంది.

ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు హిట్ రావడం, ఈ సినిమాకు భారీ కలెక్షన్లు వస్తుండటంతో రాధేశ్యామ్ సినిమాకు కలెక్షన్లు అంత కంతకూ తగ్గుతుండటం గమనార్హం.

"""/" / ది కశ్మీర్ ఫైల్స్ సినిమాకు బాలీవుడ్ తో పాటు టాలీవుడ్ లో కూడా కలెక్షన్లు అంత కంతకూ పెరుగుతుండటం గమనార్హం.

తక్కువ బడ్జెట్ తో తెరకెక్కిన ది కశ్మీర్ ఫైల్స్ రాధేశ్యామ్ సినిమాకు చుక్కలు చూపిస్తుండటం గమనార్హం.

"""/" / ప్రభాస్ సినీ కెరీర్ లోనే బిగ్గెస్ట్ డిజాస్టర్ గా రాధేశ్యామ్ సినిమా నిలిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.

ప్రభాస్ కథల విషయంలో, బడ్జెట్ విషయంలో మరింత జాగ్రత్తగా వ్యవహరించాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

ప్రభాస్ స్టార్ డైరెక్టర్ల డైరెక్షన్ లోనే నటించాలని కొంత మంది ప్రభాస్ అభిమానులు సూచనలు చేస్తుండటం గమనార్హం.

ఫ్యాన్స్ సూచనలను ప్రభాస్ పట్టించు కుంటారో లేదో చూడాల్సి ఉంది.

థియేటర్లలో ఫ్లాపైనా అక్కడ మాత్రం హిట్.. విశ్వక్ సేన్ సెలక్షన్ కు తిరుగులేదుగా!