బాలీవుడ్ సెలబ్రిటీలు గుడ్డివారు.. ది కాశ్మీర్ ఫైల్స్ డైరెక్టర్ షాకింగ్ కామెంట్స్ ?

ఒకానొక సమయంలో భారతీయ సినిమా అంటే బాలీవుడ్ సినిమాల గురించి మాత్రమే చెప్పేవారు అయితే కరోనా తర్వాత చిత్ర పరిశ్రమలో ఎన్నో మార్పులు చోటు చేసుకున్నాయి.

ప్రస్తుతం దక్షిణాది చిత్ర పరిశ్రమ నుంచి ప్రేక్షకుల ముందుకు వస్తున్నటువంటి సినిమాలు ఎంతో అద్భుతమైన విజయాలను సొంతం చేసుకుని ఇండియన్ సినిమాలుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంటున్నాయి.

ఈ విధంగా సినిమాలకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా మంచి ఆదరణ రావడంతో బాలీవుడ్ సెలబ్రిటీలు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు బాలీవుడ్ చిత్ర పరిశ్రమ పని అయిపోయింది అంటూ కామెంట్లు చేస్తున్నారు.

ఈ క్రమంలోనే ది కాశ్మీర్ ఫైల్ డైరెక్టర్ వివేక్ అగ్నిహోత్రి సైతం బాలీవుడ్ గురించి ఇదివరకే ఎన్నోసార్లు వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

అయితే తాజాగా ఈయన మరోసారి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి చేస్తున్నటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఈ సందర్భంగా వివేక్ అగ్నిహోత్రి సోషల్ మీడియా వేదికగా స్పందిస్తూ.స్టార్స్ లేనటువంటి ది కాశ్మీర్ ఫైల్స్, కాంతారా, కార్తికేయ 2, రాకెట్రీ వంటి ఈ నాలుగు సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మార్కెటింగ్, డిస్ట్రిబ్యూషన్ మద్దతు లేకుండా ప్రేక్షకుల ముందుకు వచ్చి సుమారు 800 కోట్ల కలెక్షన్లను రాబట్టాయి.

"""/"/ ఈ విధంగా 800 కోట్లు కలెక్షన్లను రాబట్టిన ఈ నాలుగు సినిమాలు కూడా కేవలం 75 కోట్ల రూపాయల బడ్జెట్ లోపే తెరకెక్కాయి.

బాలీవుడ్ ఇండస్ట్రీకి చెందినవారు గుడ్డివారు.చెవిటి వారు.

మూగవారు ఈపాటి చిన్న లెక్కను కూడా అర్థం చేసుకోలేకపోయారు అంటూ ఈ సందర్భంగా మరోసారి వివేక్ అగ్నిహోత్రి బాలీవుడ్ చిత్ర పరిశ్రమ గురించి చేసినటువంటి ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.

అయితే ఈయన చేసిన ఈ కామెంట్ పై కొందరు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

స్టార్ హీరో అయినటువంటి మాధవన్ ను పట్టుకొని స్టార్ లేని హీరో అనడం ఏంటి అంటూ నేటిజన్స్, మాధవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ప్రస్తుతం ఈయన చేసినటువంటి కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

అమెరికా అధ్యక్ష ఎన్నికలు : లైవ్ షోలో బీర్ తాగిన కమలా హారిస్.. వీడియో వైరల్