విజయవంతంగా చివరి గమ్యస్థానానికి చేరిన జేమ్స్ టెలిస్కోప్.. దాని ప్రత్యేకతలు తెలిస్తే నోరెళ్లబెడతారు..!

బిగ్ బ్యాంగ్ తర్వాత చిన్న పరిమాణం నుంచి విశ్వం ఎలా విస్తరిస్తూ పెరిగిపోయింది? గెలాక్సీలు, గ్రహాలు, నక్షత్రాలు శూన్యం నుంచి ఎలా ఏర్పడ్డాయి? మానవుల మనుగడకి ఏవైనా గ్రహాలు అనుకూలంగా ఉన్నాయా? ఇలా అన్ని రహస్యాలను తెలుసుకోవడానికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ నింగిలోకి దూసుకెళ్లింది.

క్రిస్మస్ సందర్భంగా డిసెంబర్ 25న ఫ్రెంచ్ గయానా అంతరిక్ష కేంద్రం నుంచి ప్రయోగించిన ఒక రాకెట్ నిప్పులు చిమ్ముకుంటూ ఆకాశంలోకి ఎగిసింది.

ఆ రాకెట్ లో జేమ్స్ వెబ్ టెలిస్కోప్ ప్రయాణించింది.ఆ విధంగా నెల రోజుల క్రితం భూమి నుంచి పయనమైన జేమ్స్ టెలిస్కోప్ పలు కక్ష్యలను దాటుకుంటూ తాజాగా రెండో లాంగ్రేంజ్‌ పాయింట్‌ (ఎల్‌2)ను విజయవంతంగా చేరుకుంది.

జేమ్స్ టెలిస్కోప్ తన చివరి గమ్యస్థానమైన ఎల్‌2ను చేరిందని తాజాగా నాసా ప్రకటించింది.

జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ పుడమి నుంచి 15 లక్షల కిలోమీటర్లు ప్రయాణించి ఎల్‌2 పాయింట్ ను సక్సెస్ ఫుల్ గా చేరుకుందని.

ఆ పాయింట్ నుంచి విశ్వం గురించి విలువైన సమాచారాన్ని మానవుడికి తెలియజేస్తుందని నాసా వివరించింది.

ఈ టెలీస్కోపుతో విశ్వం గుట్టును ఛేదించేందుకు ఓ అడుగదూరంలో ఉన్నట్లు నాసా వెల్లడించింది.

అమెరికా, ఐరోపా, కెనడా స్పేస్ ఏజెన్సీలు కలిసి ఈ అతిపెద్ద, అత్యంత శక్తివంతమైన జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ తయారు చేశాయి.

దీని ప్రయోగం కోసం దాదాపు రూ.73 వేల కోట్లు ఖర్చు చేశాయి.

గతంలో ప్రయోగించిన హబ్ టెలిస్కోప్ విశ్వానికి సంబంధించిన చాలా రహస్యాలను బయట పెట్టింది.

మొన్నటి వరకు విశేషమైన సేవలందించిన హబ్ టెలిస్కోప్ పనితీరు ఇప్పుడు బాగా మందగించింది.

కొద్ది రోజుల్లో అది తన స్థానం నుంచి జారుతూ ఆకాశంలోనే పేలిపోతుందని నాసా వెల్లడించింది.

అందుకే దాని స్థానంలో జేమ్స్ టెలిస్కోప్ ప్రవేశపెట్టారు.ఇది దాదాపు ఐదు నుంచి పదేళ్ల పాటు పనిచేస్తూ విశ్వం గుట్టు రట్టు చేయనుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

"""/" / ముఖ్యంగా ఒక టైం ట్రావెల్ లాగా జేమ్స్ టెలిస్కోప్ పనిచేస్తుందని.

మొదటిగా పుట్టిన నక్షత్రాలు, గెలాక్సీలకు సంబంధించిన రహస్యాలను తెలియజేస్తుందని చెబుతున్నారు.ఇన్‌ఫ్రారెడ్‌ లైటనింగ్ తో ఇది కంటికి కనిపించని అనేక మర్మమైన విషయాలను స్పష్టంగా ఫొటో తీసి భూమికి పంపిస్తుంది.

ఈ టెలిస్కోపులో ఉండే దర్పణాలు హై క్వాలిటీ పిక్చర్స్ తీయగలవు.ఇందులో అమర్చిన నియర్ ఇన్‌ఫ్రారెడ్‌ కెమెరా, నియర్ ఇన్‌ఫ్రారెడ్‌ స్పెక్ట్రోగ్రాఫ్, నియర్ ఇన్‌ఫ్రారెడ్‌ ఇమేజర్ విశ్వంలో దాగున్న ఎలాంటి రహస్యాలనైనా బహిర్గతం చేయగలవు.

డార్క్ మేటర్ లేదా కృష్ణ పదార్థం గురించి కూడా అధ్యయనం చేసేందుకు ఈ టెలిస్కోప్ ఉపయోగపడుతుందని శాస్త్రవేత్తలు విశ్వసిస్తున్నారు.

అమెరికా : ఎమర్జెన్సీ ఫోన్ నెంబర్ ‘911’ సేవలకు అంతరాయం.. లాస్‌వెగాస్‌లో పునరుద్ధరణ