జీహెచ్ఎంసీ కమీషన్ దృష్టికి ఫేక్ సర్టిఫికేట్ల వ్యవహారం..!

గ్రేటర్ హైదరాబాద్ కమిషనర్ ను బీజేపీ కార్పొరేటర్లు కలిశారు.ఈ క్రమంలోనే నకిలీ బర్త్ అండ్ డెత్ సర్టిఫికెట్ వ్యవహారాన్ని కార్పొరేటర్లు కమిషన్ దృష్టికి తీసుకువెళ్లారు.

ఈ మేరకు అత్యవసర భేటీ ఏర్పాటు చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

అయితే ఇటీవల నగరంలో 27 వేల నకిలీ బర్త్ సర్టిఫికేట్లు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే.

సరైన పత్రాలు లేకుండానే బర్త్ అండ్ డెత్ సర్టిఫికేట్లను జీహెచ్ఎంసీ అధికారులు జారీ చేశారన్న విషయం తీవ్ర కలకలం సృష్టించింది.

కాగా ఈ వ్యవహారంపై విజిలెన్స్ విచారణకు కమిషనర్ ఆదేశించారు.

అధ్యక్ష ఎన్నికల వేళ డొనాల్డ్ ట్రంప్‌కు బిగ్ రిలీఫ్.. ఆ కేసు కొట్టివేత