ఇదెక్కడి విడ్డురం: చిరిగిన చలికోటు ధర.. ఏకంగా..?
TeluguStop.com
మరికొన్ని రోజుల్లో చలికాలం రాబోతుంది.చలిని తట్టుకోవడానికి అందరు చలికోట్లు వేసుకుంటూ ఉంటారు కదా.
అయితే మనం కోనే స్వెటర్లు మహా అయితే ఎంత ఉంటాయి ఏ 1000 లేదంటే 2000 ఉంటాయి.
కానీ ఈ స్వెటర్ ధర మాత్రం అక్షరాలా లక్ష రూపాయలట.ఇంకో విచిత్రం ఏంటంటే ఈ చలికోటుకు అన్ని చిరుగులే.
కానీ ధర మాత్రం ఆకాశాన్ని అంటుంది.మరి ఇంత ఖర్చుపెట్టి చలి కోటు ఎవరు కొంటారు అని ఆశ్చర్యపోతున్నారా ఎందుకు కొనరు చెప్పండి.
ఈ కాలంలో ఎవరు ఏ ట్రెండ్ ఫాలో అయితే ఎదుటివారు కూడా అదే ట్రెండ్ ఫాలో అవుతున్నారు కదా.
చలికాలం వస్తుందంటే చాలు కంపనీలు కూడా రకరకాల డిజైన్లతో సరి కొత్తగా స్వీటెర్స్ ను తయారు చేసి మార్కెట్లోకి రిలీజ్ చేస్తున్నారు.
ఈ క్రమంలోనే టాన్ జీన్స్ అనే వస్త్ర రంగ సంస్థ ఇప్పుడు సరికొత్త ట్రెండ్ క్రేయేట్ చేసిందనే చెప్పాలి.
ఈ కంపనీ దుస్తులు మార్కెట్లోకి వచ్చిన కొత్తలో చాలా మంది కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించలేదు.
అప్పట్లో టాన్ జీన్స్ పేరు మార్చి బెగ్గర్ జీన్స్ అని ఫన్నీగా పిలుచుకునే వారు కొంతమంది ఆకతాయిలు.
అ తరువాత కొద్ది రోజులకే బెగ్గర్ జీన్స్ ను, కాదు కాదు టాన్ జీన్స్ దుస్తులు కొనడానికి జనాలు ఒక లెవెల్లో ఎగబడ్డారు అంటే నమ్మండి.
కాగా ఈ జీన్స్ చూడడానికి అతుకులతులుగా ఉంటాయి. """/"/
ఈ జీన్స్ బాగా ఫేమస్ అవ్వడంతో కేవలం ప్యాంట్లు మాత్రమే కాకుండా షర్ట్స్, స్వెటర్స్ లో అందుబాటులోకి తెచ్చారు.
తాజాగా ఒక ఫేమస్ ఫ్యాషన్ బ్రాండ్ బాలెన్సియాగాడిస్ట్రాయిడ్ క్రూనెక్' అనే సరికొత్త పేరుతో వెరైటీ స్వెటర్లను మార్కెట్లోకి విడుదల చేసింది.
అయితే స్వెటర్ చూడడానికి ఎలా ఉంటుందంటే పిచ్చి కుక్క మన వెనుక పడి మన బట్టలు చించేస్తే ఎలా ఉంటుందో అలా ఉంటుందన్నమాట.
అయితే ఈ చలికోటును 100% ఉన్నితో తయారు చేసారు.కానీ చలికోటు డిజైన్ మాత్రం అక్కడక్కడ ఎలుకలు కొట్టేస్తే ఎలా ఉంటాయో అలా చిల్లులు పడిన స్వెటర్‌లాగే ఉంటుంది.
అయినాగానీ ఈ స్వెటర్ ధర ఏమి తక్కువ కాదు.దీని ధర మన ఇండియన్ కరెన్సీలో లక్షకు పైమాటే ఉంటుంది మరి.
ఇకపోతే ఈ చలికోటు యూత్ ను ఎంత వరకు అట్ట్రాక్ట్ చేస్తుందో రానున్న రోజుల్లో చూడాలి.
అమరన్ సినిమాతో పది మెట్లు పైకి ఎక్కిన సాయిపల్లవి.. ఈ బ్యూటీకి తిరుగులేదుగా!