పాప్లర్ చెట్ల పెంపకంలో పెట్టుబడి తక్కువ.. ఆదాయం లక్షల్లో..!

వ్యవసాయ రంగంలో పెట్టుబడి తక్కువగా ఉండే, ఆదాయం ఎక్కువగా ఉండే పంటను పండించడానికి రైతులు ఎక్కువ ఆసక్తి చూపిస్తారు.

పైగా భారతదేశంలో( India ) 60 శాతానికి పైగా మంది వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు.

మార్కెట్లో అధిక డిమాండ్ ఉండే పంటలను పండిస్తేనే ఆదాయం అనేది లాభదాయకంగా ఉంటుంది.

పాప్లర్ చెట్లకు( Poplar Trees ) ప్రపంచవ్యాప్తంగా మంచి డిమాండ్ ఉంది.ఎందుకంటే ఈ పాప్లర్ చెట్ల చెక్కతో కాగితం, చాప్ స్టిక్స్, చెక్క పెట్టెలు, అగ్గి పుల్లలు, లైట్ ప్లైవుడ్ లాంటివి తయారు చేస్తారు.

ఒక్క భారతదేశంలోనే కాకుండా ఆసియా, అమెరికా, యూరప్ దేశాలలో కూడా ఈ చెట్లను అధిక సంఖ్యలో పెంచుతున్నారు.

ఈ చెట్లను పెంచే విధానం గురించి పూర్తిగా తెలుసుకుందాం. """/" / ఈ పాప్లర్ చెట్లను కాటన్ వుడ్ ( Cotton Wood )అని కూడా పిలుస్తారు.

వేసవికాలంలో ఈ చెట్లలో పెరుగుదల అనేది కాస్త ఎక్కువగా ఉంటుంది.భూమి యొక్క పీహెచ్ విలువ 6 నుండి 8 మధ్యన ఉండాలి.

ఇక ఉష్ణోగ్రత ఐదు నుంచి 45 డిగ్రీల మధ్యలో ఉంటే ఈ చెట్లు ఆరోగ్యంగా పెరుగుతాయి.

ఒక చెట్టు దాదాపుగా 80 అడుగులు పెరుగుతుంది.కాబట్టి చెట్ల మధ్య కనీసం 12 నుంచి 15 అడుగుల దూరం ఉండాలి.

"""/" / ఈ చెట్లు నాటిన ఐదు సంవత్సరాలకు కోతకు వస్తాయి.అంతేకాదు ఈ చెట్ల మధ్యలో అంతర పంటగా ఇతర పంటలను కూడా సాగు చేసుకోవచ్చు.

ఈ చెట్ల మొక్కలు ఆన్లైన్లో కూడా అందుబాటులో ఉన్నాయి.ఎవరైనా ఈ మొక్కలను పెంచాలి అనుకుంటే ఆన్లైన్లో కొనుగోలు చేయవచ్చు.

ఇక మార్కెట్లో ఒక చెట్టుకు దాదాపుగా నాలుగువేల ధర ఉంటుంది.ఒక హెక్టారులో ఈ చెట్లను పెంచడం వల్ల దాదాపుగా రూ.

5 లక్షల వరకు ఆదాయం పొందవచ్చు.ఇక ఈ చెట్ల మధ్యన అంతర పంటగా టమోటా, బంగాళదుంప, కొత్తిమీర లాంటి పంటలు సాగు చేసి అదనపు ఆదాయం పొందవచ్చు.

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎక్కువగా డ్యూయల్ రోల్ సినిమాల్లో నటించిన హీరో ఎవరంటే?