రంగారెడ్డి జిల్లాలో యువతి కిడ్నాప్ కేసులో దర్యాప్తు వేగవంతం
TeluguStop.com
రంగారెడ్డి జిల్లాలో డెంటిస్ట్ వైశాలి కిడ్నాప్ కేసులో పోలీసులు దర్యాప్తు ముమ్మరంగా కొనసాగుతోంది.
కేసులో నవీన్ రెడ్డి సహా మొత్తం 16 మందిపై కేసులు నమోదు చేశారు.
అదేవిధంగా నిందితులపై పీడీ యాక్ట్ కూడా పెడతామని పోలీసులు చెబుతున్నారు.ప్రస్తుతం వైశాలి మాట్లాడలేని స్థితిలో ఉందని తెలిపారు.
ఓ వైపు వైశాలిని 2021 ఆగస్టులోనే పెళ్లి చేసుకున్నానని నవీన్ రెడ్డి చెబుతుండగా.
ఆ మాటల్లో వాస్తవం లేదని వైశాలి తల్లిదండ్రులు తెలిపారు.తమను తమ కూతురిని ప్రేమ పేరుతో నవీన్ రెడ్డి తీవ్ర వేధింపులకు గురి చేశాడని ఆరోపిస్తున్నారు.
నిన్న సుమారు వంద మంది అనుచరులతో వచ్చిన నవీన్ రెడ్డి వైశాలి ఇంటిపై, కుటుంబ సభ్యులపై దాడి చేసి ఆమెను తీసుకెళ్లిన సంగతి తెలిసిందే.
రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాకు మరో భారీ షాక్.. ఊహించని నష్టాలు తప్పవా?