మొబైల్ ని కనిపెట్టినవాడు మొబైల్ ని పక్కనపెట్టి జీవితాన్ని ఆస్వాదించమని చెప్తున్నాడు?

అదేంటి? మొబైల్ ని కనిపెట్టినవాడు మొబైల్ ని పక్కనపెట్టమని అడుగుతున్నాడు! అని అనుకుంటున్నారా? దానికి చాలా కారణాలు వున్నాయండోయ్.

నేడు మానవుడు ఓ యంత్రంలాగా జీవిస్తున్నాడు.మనిషి ఓ మనిషిలాగ జీవించి చాలా సంవత్సరాలు గడుస్తోంది.

నేటి మానవులు రోబోట్స్ మాదిరి జీవిస్తున్నారు.దానికి ఎన్నో కారణాలు ఉన్నప్పటికీ అందులో కీలకమైనది.

సెల్ ఫోన్.అవును.

ఈ తరం భూమిమీదే ఉన్నప్పటికీ సోషల్ మీడియాలో జీవిస్తున్నాడు.కనీసం తమ కుటుంబ సభ్యులతో కూడా గడిపే సమయం లేకపోతోంది.

వున్న కొద్దిపాటి సమయాన్ని కూడా సెల్ ఫోన్ కి అంకితం ఇస్తున్నాడు.ఈ కారణంగా స్వయంగా మొబైల్ సృష్టికర్తనే ఆవేదన చెందాడు.

దాంతో ఈ డివైజ్ వల్ల ఏర్పడుతున్న నష్టాన్ని గురించి గుర్తు చేసాడు.ఇందులో ఎక్కువ సమయం గడుపుతున్న వారికి కొన్ని సలహాలు, సూచనలు సిఫార్సు చేశాడు.

ఇకపోతే ప్రపంచంలోని మొట్టమొదటి మొబైల్ ఫోన్‌ను కనుగొన్న అమెరికన్ ఇంజనీర్ 'మార్టిన్ కూపర్' అన్న సంగతి తెలిసినదే కదా.

ఆయన రోజుకు 5 గంటలకు పైగా సమయాన్ని ఫోన్‌‌లోనే వెచ్చిస్తున్న యాజర్లకు 'జీవితాన్ని పొందండి (గెట్ ఏ లైఫ్)' అంటూ సలహా ఇస్తున్నాడు.

"""/"/ సెల్‌ఫోన్ సర్వస్వంగా బతుకుతున్న యువతకు కౌన్సిలింగ్ ఇస్తున్నాడు.ఈ క్రమంలో తమ మొబైల్స్‌లో తక్కువ సమయం గడపాలని, గాడ్జెట్స్ పక్కన పెట్టి అసలైన జీవితాన్ని ఆస్వాదించామని కోరుతున్నాడు.

ఇదిలా ఉంటే.యాప్ మానిటరింగ్ సంస్థ అయినటువంటి App Annie ప్రకారం ప్రజలు రోజుకు సగటున 4.

8 గంటలు ఫోన్లతోనే గడుపుతున్నారని తేలింది.ఈ సంఖ్య వారానికి 33.

6 గంటలు కాగా నెలకు 144 గంటలుగా ఉంటోంది.ఈ విషయం తెలుసుకున్న మార్టిన్ కంగారు పడ్డాడు.

కాగా మార్టిన్ 1973లో Motorola DynaTAC 8000Xని కనిపెట్టిన సంగతి విదితమే.ఇదే మొట్టమొదటి వైర్‌లెస్ సెల్యులార్ పరికరం.

మూఢం సమయంలో శుభకార్యాలు.. చేస్తే జరిగేది ఇదే..!