జాతీయస్థాయిలో సంచలనం రేపుతున్న ఇండియా టుడే సర్వే..!!
TeluguStop.com
ప్రస్తుతం దేశవ్యాప్తంగా బీజేపీ హవా నడుస్తున్న సంగతి తెలిసిందే.2014 ఆ తర్వాత 2019 ఎన్నికలలో వరుసగా రెండుసార్లు ఎవరి మద్దతు లేకుండా బీజేపీ కేంద్రంలో అధికారంలోకి రావడం జరిగింది.
ఈ క్రమంలో జాతీయస్థాయిలో మిగతా పార్టీలు ఎలాగైనా బీజేపీని దెబ్బ కొట్టడానికి అనేక రీతులుగా ప్రయత్నాలు చేస్తూనే ఉండగా.
ఆదిలోనే ఆ ప్రయత్నాలు విఫలమవుతున్నాయి.ఇప్పటివరకు బీజేపీకి సరైన ప్రతిపక్ష పార్టీ జాతీయస్థాయిలో కనబడటం లేదు.
పరిస్థితి ఇలా ఉంటే తాజాగా ఇండియా టుడే సర్వే నిర్వహించింది.ఇప్పటికి ఇప్పుడు దేశవ్యాప్తంగా ఎన్నికలు జరిగితే ఎవరు గెలుస్తారు అన్నదానిపై నిర్వహించిన సర్వేలో ఆసక్తికరమైన ఫలితాలు వెలువడ్డాయి.
దేశంలో ఇప్పటికప్పుడు లోక్ సభ ఎన్నికలు జరిగితే బీజేపీ ఆధ్వర్యంలో ఎన్డీఏకి 286 స్థానాలు, ఇక కాంగ్రెస్ దాని మద్దతు పార్టీలకు సంబంధించిన 146 స్థానాలు, మిగతా పార్టీలకు మొత్తం కలిపి 111 స్థానాలు వస్తాయని .
ఇండియా టుడే సర్వే వెల్లడించింది. """/" /
ఎన్డీఏకు 21 సీట్లు తగ్గి .
కాంగ్రెస్ బలపడే అవకాశం ఉందని చెప్పుకొచ్చింది.వచ్చే సార్వత్రిక ఎన్నికలలో కాంగ్రెస్ మరియు ప్రాంతీయ పార్టీలు కలసి పోటీ చేస్తే బీజేపీకి గట్టి పోటీ ఇవ్వోచ్చని పేర్కొంది.
ఇక ఇదే సమయంలో దేశంలో 53 శాతం మంది ఇంకా మోడీనే ప్రధానిగా కొనసాగాలని కోరుకుంటున్నట్లు ఈ సర్వే ఫలితాలలో తేలింది.