సీనియ‌ర్ నేత డీఎస్ చేరిక వ్య‌వ‌హారంలో కీల‌క మ‌లుపు

సీనియర్ నేత ధర్మపురి శ్రీనివాస్ చేరిక వ్యవహారంలో ట్విస్ట్ నెలకొంది.కాంగ్రెస్ లో చేరిన డీఎస్ ఇవాళ రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించార‌ని స‌మాచారం.

ఈ మేరకు ఏఐసీసీ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖ‌ర్గేకు పంపించారని సమాచారం.తన కుమారుడు సంజయ్ చేరిక సందర్భంగానే తాను గాంధీభవన్ కు వెళ్లిన‌ట్లు లేఖ‌లో పేర్కొన్నారు.

ఈ క్రమంలోనే మళ్లీ కాంగ్రెస్ పార్టీలో చేరినట్లు ప్రచారం జరిగిందన్నారు.కానీ తాను ఎప్ప‌టికీ కాంగ్రెస్ వాదినేనన్న డీఎస్ ప్రస్తుతం రాజకీయాలకు దూరంగా ఉంటున్నట్లు తెలిపారు.

కాంగ్రెస్ లో తన చేరిక.తన కుమారుడి టికెట్ కు ముడి పెట్టడం సరికాదని పేర్కొన్నారు.

ఈ క్రమంలో తనను వివాదాల్లోకి లాగొద్దని కోరారు.కాంగ్రెస్ లో తాను చేరినట్లు భావిస్తే ఈ లేఖను రాజీనామా అనుకొని ఆమోదించగలరని ఖ‌ర్గేను డీఎస్ కోరారు.

అలాంటి మంచి అవకాశాన్ని మిస్ చేసుకున్న రాబిన్ హుడ్ సినిమా.. ఇప్పట్లో విడుదల అయ్యేలా కనిపించడం లేదుగా!