టికెట్ ప్రకటించేసుకుంటున్న ఇంచార్జీలు ? టీడీపీ లో గందరగోళం
TeluguStop.com
ఏపీ తెలుగుదేశం పార్టీలో గత కొంతకాలంగా రాజకీయ సందడి పెరిగిపోయింది.ముఖ్యంగా ఆ పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు కార్యకర్తల్లో ఉత్సాహం పెంచేందుకు జిల్లా పర్యటనలు చేస్తూనే మినీ మనోహనాడులు నిర్వహిస్తూ, కార్యకర్తల్లో ఉత్సాహం పెంచే ప్రయత్నం చేస్తున్నారు.
అంతేకాకుండా వివిధ ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తూ, ఎన్నికల యుద్ధం చేస్తున్నారు .
అధికార పార్టీ వైసీపీని ఎదుర్కోవడం పెద్ద కష్టమేమీ కాదన్న అభిప్రాయాన్ని కార్యకర్తల్లో నింపే ప్రయత్నం చేస్తున్నారు.
ఇప్పటికే పార్టీ శ్రేణులను ఎన్నికల మూడ్ లోకి చంద్రబాబు తీసుకువెళ్లారు.నియోజకవర్గంలో పార్టీ కార్యక్రమాలు పెద్ద ఎత్తున చేపడుతూ ఆందోళనలు నిర్వహించాలని నియోజకవర్గ ఇన్చార్జీలకు , కీలక నాయకులకు ఒకపక్క ఆదేశాలు జారీ చేస్తూనే , ఎన్నికలను ఎదుర్కొనేందుకు ఏమేం చేయాలని విషయంపై సమావేశాలు నిర్వహిస్తున్నారు.
ఇదిలా ఉంటే ఎన్నికలు ఎప్పుడు జరిగిన టిక్కెట్లు విషయంలో చంద్రబాబు చివరి వరకు ఏమీ తేల్చరు .
చివరి నిమిషంలోనే అభ్యర్థులను ప్రకటించడం ఆనవాయితీ గా వస్తోంది.అయితే ఈ వ్యవహారం తలనొప్పిగా మారుతూ, ఎన్నికల సమయంలో ఇబ్బందులు కలిగిస్తూ ఉండడంతో ముందుగానే కొన్ని కొన్ని నియోజకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటిస్తూ వస్తుండగా, మరికొన్ని చోట్లనియోజకవర్గ ఇన్చార్జిలే తమకు తామే టికెట్ లను ప్రకటించేసుకుంటున్నారు.
ఇటీవల కృష్ణ, గుంటూరు, ప్రకాశం, కర్నూలు , కడప ,చిత్తూరు, ఉభయగోదావరి జిల్లాలకు చెందిన 17 అసెంబ్లీ నియోజకవర్గాలపై చంద్రబాబు సమీక్ష నిర్వహించారు.
ఈ సందర్భంగా పార్టీ పరిస్థితులు, ఇన్చార్జిల పరిస్థితి పై ఆయన సమీక్ష చేపట్టారు.
ఈ సందర్భంగా తన దగ్గర ఉన్న నివేదికలు, సర్వే రిపోర్టులను బయటపెట్టి వాస్తవ పరిస్థితిని వివరించారట.
అలాగే కొంతమందికి గట్టిగానే క్లాస్ పీకినట్లు సమాచారం.ముఖ్యంగా అవనిగడ్డ, పెనమలూరు, ఆళ్లగడ్డ ,మార్కాపురం, గుడివాడ, గుంటూరు ఈస్ట్, ఒంగోలు, రాజంపేట ,పుంగనూరు నియోజకవర్గాల్లో ఎక్కువ ఫోకస్ పెంచాలని చంద్రబాబు సూచించారట.
"""/"/
అయితే ఈ సమావేశం ముగిసిన అనంతరం నియోజకవర్గాలకు వెళ్లిన ఇంచార్జిలు తమకు టికెట్ ఖరారు చేశారని ప్రచారం చేసుకోవడంతో దీనిపై పెద్ద దుమారమే పార్టీలో రేగింది.
అసలు ఏ విధంగా టికెట్ ఖరారు చేశారనే చర్చ తెరపైకి వచ్చింది.దీంతో ఈ సమావేశాలకు వెళ్లి వచ్చిన ఇన్చార్జిలే అధినేత ప్రమేయం లేకుండా ఈ విధంగా టికెట్ కన్ఫర్మ్ అయిందని ప్రచారానికి దిగడం వంటి విషయాలపై ఇప్పుడు పార్టీలో హాట్ హాట్ చర్చకు కారణం అయ్యింది.
ఓట్స్ ఆరోగ్యకరమే.. కానీ వారు తినకపోవడమే బెటర్..!