లంగ్ క్యాన్సర్‌ లక్షణాలు ఇవి... జాగ్రత్త

గత దశాబ్దకాలంలో లంగ్ క్యాన్సర్ తో మరణించేవారి సంఖ్య చాలావరకు పెరిగింది.ఇందులో ఒక విచిత్రమైన నిజం ఏమిటంటే అందులో 35% మందికి చావు దగ్గరికి వచ్చేదాకా ఇలాంటి జబ్బు వచ్చిందని తెలియట్లేదట.

కాని ఈ వ్యాధి లక్షణాలు చాలా సందర్భాల్లో బయటపడతాయి.ఆ లక్షణాలు ఏంటో తెలియకే నష్టపోతున్నారు చాలామంది.

మరి లంగ్ క్యాన్సర్‌ లక్షణాలు ఏంటో ఈరోజు చూద్దాం.* దగ్గు లంగ్ క్యాన్సర్‌ యొక్క ప్రధాన లక్షణం.

ఏదో ఇంఫెక్షన్ వలన వచ్చిన దగ్గైతే ఒకటి, రెండువారాలు ఉంటుంది.కాని రోజంతా దగ్గకపోయినా, రోజూ దగ్గతుంటే మాత్రం డాక్టర్ ని సంప్రదించండి.

* అకస్మాత్తుగా బరువు తగ్గడం కూడా లంగ్ క్యాన్సర్ యొక్క లక్షణం.క్యాన్సర్ సెల్స్ మీ బలాన్ని వాడుకోవడం వలన ఇలా జరుగుతుంది.

కాబట్టి బరువు కూడా రెగ్యులర్‌గా చెక్ చేసుకోవాలి. """/"/ * ఒంటినొప్పులు రాత్రిపూట రావడం, కండరాల్లో, ఎముకల్లో నొప్పిగా అనిపించటం కూడా ఈ వ్యాధి లక్షణాల్లో ఒకటి.

* గొంతులో మార్పు రావడం, మాటలో అదోరకమైన తేడా ఉండటం.జలుబు లేకున్నా ఇలా జరిగితే మీరు ప్రమాదంలో ఉన్నట్టే.

* ఛాతి నొప్పి, వెన్నునొప్పి, బాహువుల్లో నొప్పి తరచుగా వస్తే అనుమానపడాల్సిందే.* శరీరానికి కష్టం కలిగించిన పని ఏదైనా చేయగానే ఊపిరి సరిగా ఆడకపోవడం.

శ్వాస తీసుకోవడంలో మార్పు కనిపించినా, ఏమాత్రం ఆలస్యం చేయకుండా టెస్టులు చేయించుకోండి.

సూపర్ లాంగ్ అండ్ షైనీ హెయిర్ కోసం ఇది ట్రై చేయండి..!