గాజువాకలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఏపీలోనే ఎత్తయినదిగా నిలవనుంది.
TeluguStop.com
గాజువాకలో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహం ఏపీలోనే ఎత్తయినదిగా నిలవనుంది.కైలాస విశ్వరూప మహాగణపతి విగ్రహం ప్రత్యేకలతో రూపు దిద్దుకుంటోంది.
విగ్రహానికి నేరుగా కళ్లు ఉండవు.విగ్రహం వెనుక భాగంలో శివపార్వతుల విగ్రహాలను ఏర్పాటు చేస్తున్నారు.
శివుని విగ్రహం నుంచి ఒక కన్ను, పార్వతి విగ్రహం నుంచి మరో కన్నును వినాయకునిగా కళ్లుగా అమర్చుతున్నారు.
మండపంలో నుంచి విగ్రహాన్ని చూస్తే వినాయక విగ్రహం పరిపూర్ణంగా కనిపిస్తుంది.మండపానికి దూరం నుంచి చూస్తే శివపార్వతుల విగ్రహాలు హైలెట్ గా కనిపిస్తాయి.
వినాయక విగ్రహం ఏర్పాటు చేయడానికి భారీ సెట్టింగ్ లను వేశారు.89 అడుగుల భారీ విగ్రహం కోసం 94 అడుగుల ఎత్తు, 65 అడుగుల వెడల్పుతో ప్రత్యేక మండపం నిర్మించారు.
దీనికోసం చెన్నైకు చెందిన 26 మంది కళాకారులు 60 రోజులుగా పని చేస్తున్నారు.
మండపం చుట్టూ గార్డెనింగ్, వీఐపీ ఎంట్రన్స్, భక్తుల కోసం 10 లైన్ల బారికేడ్లు ఏర్పాటు చేస్తున్నారు.
ఇక మహాగణపతిని ప్రతిష్టించినచోటే నిమజ్జనం చేయడానికి ప్రణాళిక రూపొందించారు.18 రాత్రులపాటు ఉత్సవాలు కొనసాగుతాయి.
అనంతరం ప్రతిష్టించినచోటే 70 శాతం నీళ్లు, 30 శాతం పాలతో విగ్రహ నిమజ్జన మహోత్సవాన్ని నిర్వహిస్తారు.
తరువాత ఆ మట్టిని సముద్రంలో కలుపుతారు.నిమజ్జనోత్సవానికి కృష్ణానది నుంచి ఒక ట్యాంకు వాటర్, గోదావరి నుంచి ఒక ట్యాంకు వాటర్ తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
వినాయకుని వద్ద నిర్వాహకులు 151 కేజీల లడ్డూ ప్రసాదాన్ని ఏర్పాటు చేసారు.అందరి దృష్టినీ ఆకర్షించే ఖైరతాబాద్ వినాయక విగ్రహ రూపకర్త చిన్నస్వామి రాజేంద్రన్ గాజువాకలో విగ్రహాన్ని రూపొందించారు.
అంతేకాకుండా భారీ విగ్రహాన్ని రూపొందించడంలో మరో కళాకారుడు రమేష్ కూడా కీలకంగా వ్యవహరించారు.
గాజువాకకు ప్రత్యేక గుర్తింపుతీసుకురావడానికి ఈ ప్రయత్నం చేస్తున్నానని ఉత్సవ నిర్వాహకుడు కొసిరెడ్డి గణేష్ కుమార్ అంటున్నాడు.
కేవలం విగ్రహం ఎత్తు పెంచడమే కాకుండా ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకొని వినూత్నంగా విగ్రహన్ని తయారు చేయించామని చెబుతున్నాడు.
బైరతాబాద్ వినాయకుడిని తయారు చేస్తున్న రాజేంద్రన్ ఈసారి మా విగ్రహం తయారు చేయడం సంతోషంగా ఉందని, గాజువాక ఖ్యాతి దేశం నలుమూలలా చేరే విధంగా ఉత్సవాలను నిర్వహిస్తామని గణెష్ కుమార్ అంటున్నాడు.
కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడో రాజీనామా చేస్తారా? జగ్మీత్ సింగ్ వ్యూహం ఏంటీ?