భర్తకు మరో యువతితో పెళ్లి చేసిన భార్య.. చివర్లో అసలైన ట్విస్ట్..!
TeluguStop.com
సాధారణంగా చాలామంది వ్యక్తులు మొదటి వివాహాన్ని దాచిపెట్టి రెండో వివాహం చేసుకుంటారు.ఈ రెండో వివాహం గురించి మొదటి భార్యకు తెలియకుండా జాగ్రత్తలు తీసుకుంటారని మనందరికీ తెలిసిందే.
అలాకాకుండా మొదటి భార్యనే భర్తకు మరొక యువతితో వివాహం చేసిందంటే వినడానికి కాస్త నమ్మశక్యంగా అనిపించకపోవచ్చు.
కానీ హైదరాబాదులోని బంజారాహిల్స్( Banjara Hills In Hyderabad ) లో ఓ వివాహిత తన భర్తకు మరో యువతితో దగ్గరుండి మరి వివాహం చేయించింది.
బాధితురాలు తాను రెండో భార్య అని తెలిసి పోలీసులను ఆశ్రయించింది.అసలు ఏం జరిగిందో అనే వివరాలు చూద్దాం.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.హైదరాబాద్ బంజారాహిల్స్ లోని సింగాడి గుంట( Singadi Gunta ) బస్తికి చెందిన ఒక యువతి హోమ్ ట్యూటర్ గా పని చేస్తోంది.
ఇంకా ఆ యువతీ యూసఫ్ గూడా లోని ఒక డాన్స్ అకాడమీలో శిక్షణ తీసుకునేందుకు వెళ్లిన సమయంలో గాంధీ( Gandhi ) అనే యువకుడితో పరిచయం ఏర్పడింది.
ఈ పరిచయం చివరికి ప్రేమగా మారి ఇద్దరు కుటుంబ సభ్యులను ఒప్పించి వివాహం చేసుకోవాలి అనుకున్నారు.
"""/" /
ఇరు కుటుంబ సభ్యులు అంగీకరించడం, ఇద్దరికీ నిశ్చితార్థం కూడా అయిపోయింది.
ఇద్దరు కలిసి ఒకే చోట జీవిస్తున్నారు.అయితే ఈ సమయంలోనే గాంధీకి రోజా అనే యువతీతో పరిచయం ఏర్పడింది.
రోజా అనే యువతితో ప్రేమ వ్యవహారం నడుపుతున్నాడేమో అని ప్రియురాలికి అనుమానం వచ్చింది.
ఈ విషయం ఇంట్లో చెప్పడం వల్ల ఇరు కుటుంబాల మధ్య గొడవలు జరగడం, ఈ గొడవ పోలీస్ స్టేషన్ వరకు వెళ్లడం జరిగింది.
"""/" /
తాము ఇద్దరం స్నేహితులమని, తమకు ఎలాంటి దురుద్దేశం లేదని రోజా చెప్పడంతో గాంధీ ప్రియురాలు, గాంధీని వివాహం చేసుకునేందుకు అంగీకరించింది.
ఈ ఏడాది మే 14న పెద్దల సమక్షంలో ఘనంగా వివాహం జరిగింది.ఈ పెళ్లికి హాజరైన రోజా పెళ్లి పెద్దగా అన్ని పనులు దగ్గరుండి చూసుకొని మరి పెళ్లి చేసింది.
కొంతకాలం వీరి కాపురం సజావుగానే సాగింది.అయితే గాంధీ ఇంటికి ఆలస్యంగా రావడం, ఎదురు ప్రశ్నిస్తే కొట్టడం ప్రారంభించాడు.
గాంధీ, రోజాలకు ఇంతకుముందే వివాహం అయిందని తెలిసి తాను మోసపోయానని, న్యాయం కోసం పోలీసులను ఆశ్రయించింది.