అఫైర్ పెట్టుకున్న భార్యను సీక్రెట్ కెమెరాతోనే పట్టుకున్న భర్త.. కానీ కోర్టులో షాక్..?

కొన్ని దేశాల చట్టాలు చాలా విచిత్రంగా ఉంటాయి.అలాంటి చట్టాలకు లోబడి ఎన్ని అన్యాయమైన పనులైనా చేయవచ్చు.

కొన్నిసార్లు ఈ చట్టాలే మన తప్పు లేకపోయినా జైలు పాలు చేస్తాయి కూడా.

అందుకే ఎప్పుడైనా న్యాయం కోసం వెళ్తున్నపుడు లేదా లీగల్ ప్రొసీడింగ్స్ స్టార్ట్ చేసేటప్పుడు అన్ని లాస్ గురించి తెలుసుకోవాలి.

లేదంటే ఇదిగో ఈ తైవాన్‌ వ్యక్తికి తగిలిన షాకే తగులుద్ది.ఈ వ్యక్తి తన భార్య మరొకరితో అఫైర్ పెట్టుకున్నట్లు ఓ సీక్రెట్ కెమెరా ద్వారా తెలుసుకున్నాడు.

అదే ప్రూఫ్‌గా చూపిస్తూ డివోర్స్ ఫైల్ చేశాడు.కానీ కోర్టు తీర్పు అందరినీ షాక్‌కి గురి చేసింది.

భార్యకు ఏ శిక్ష విధించకుండా, ఆ వ్యక్తినే మూడు నెలలు జైలుకు పంపించింది.

అసలు ఏం జరిగిందంటే.తైవాన్‌లో ఫాన్ ( Fan In Taiwan )అనే వ్యక్తి నివసిస్తున్నాడు.

తన భార్య మరొకరితో రిలేషన్‌షిప్‌లో ఉందని అనుమానించిన ఆయన, తన ఇంట్లోని బెడ్‌రూమ్, హాల్‌లో హిడెన్ కెమెరాలు ఏర్పాటు చేశాడు.

కెమెరాలో భార్య మరొకరితో ఉన్న దృశ్యాలు చూసి ఆయన షాక్‌కు గురయ్యాడు.తర్వాత ఫాన్ చాలా బాధపడ్డాడు.

ఆ తర్వాత తన భార్య నుంచి విడాకులు( Divorce ) తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు.

"""/" / ముందుగా, ఫాన్ తన భార్యతో ప్రశాంతంగా మాట్లాడి విడాకులు తీసుకోవాలని అనుకున్నాడు.

కానీ ఆమె ఒప్పుకోకపోవడంతో కోర్టుకు వెళ్లి విడాకుల కేసు వేశాడు.మరోవైపు, ఫాన్ భార్య పోలీసులకు ఫిర్యాదు చేసింది.

ఆయన సీక్రెట్ కెమెరాలు పెట్టి తన ప్రైవసీని ఉల్లంఘించాడని ఆరోపించింది.ఫాన్ మాత్రం తన భార్య వల్ల పిల్లలు చాలా బాధపడుతున్నారని, తన భార్య ఎక్కువ సమయం బెడ్‌రూమ్‌లోనే ఉంటుందని, అందుకే కెమెరాలు పెట్టాడని కోర్టుకు చెప్పాడు.

కానీ కోర్టు ఫాన్ వివరణను నమ్మలేదు.తన భార్య జీవితాన్ని సీక్రెట్ గా రికార్డు చేసినందుకు ఫాన్‌కు మూడు నెలలు జైలు శిక్ష విధించింది.

"""/" / తైవాన్‌లోని చట్టాల ప్రకారం భర్త తన భార్యను సీక్రెట్ గా రికార్డు చేయడం నేరం.

అందుకే అతనికే శిక్ష పడిందన్నమాట.ఈ కేసు సోషల్ మీడియాలో చాలా చర్చకు దారితీసింది.

ఈ చట్టం చాలా విచిత్రంగా, చెత్తగా ఉందని నెటిజన్లు పేర్కొన్నారు.అయ్యో పాపం అని మరికొందరు ఆ భర్త పరిస్థితి పట్ల జాలి చూపిస్తున్నారు.

ట్రోల్స్ ఎఫెక్ట్… డిప్రెషన్ లోకి వెళ్లిపోయిన నటి… షాకింగ్ విషయాలు రివీల్?