టీఎస్పీఎస్సీలో బయటపడుతున్న ఇంటి దొంగల బాగోతం
TeluguStop.com
టీఎస్పీఎస్సీ పేపర్ లీకేజ్ వ్యవహారంలో ఇంటి దొంగల బాగోతం బయటపడుతోంది.కేసులో సిట్ అధికారుల దర్యాప్తులో కీలక విషయాలు తెలుస్తున్నాయి.
ఈ క్రమంలో మరో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నారు.రమేశ్, షమీమ్, సురేశ్ ను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు.
దీంతో పేపర్ లీకేజ్ కేసులో నిందితుల సంఖ్య మొత్తం 12కు చేరుకుంది.గ్రూప్ 1 రాసిన టీఎస్పీఎస్సీ ఉద్యోగుల్లో పది మందికి వందకి పైగా మార్కులు వచ్చాయని నిర్ధారించారు.
అదేవిధంగా రమేశ్, షమీమ్, సురేశ్ కు టాప్ మార్కులు వచ్చినట్లు సిట్ గుర్తించింది.
మరోవైపు నిందితుడు రాజశేఖర్ తో సంబంధాలు ఉన్న 42 మందికి నోటీసులు అందజేశారు.
వైరల్ వీడియో: టేకాఫ్ అవుతుండగా విమానంలో చెలరేగిన మంటలు.. చివరకి?