40 ఏళ్ల వయసులో 16 ఏళ్ల పిల్లగా మారిపోయిన హీరోయిన్.. ఎంత అందంగా ఉందో!
TeluguStop.com
టాలీవుడ్ సినీ నటి స్టార్ హీరోయిన్ అయిన భూమిక గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
మొదట యువకుడు సినిమాతో సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ బ్యూటీ ఆ తర్వాత వచ్చిన ఖుషి సినిమాతో స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది.
ఖుషి సినిమా విడుదల అయ్యి ఇన్ని ఏళ్ళు అవుతున్నా కూడా అందులో పాటలను, సన్నివేశాలను ఇప్పటికీ అభిమానులు గుర్తుంచుకున్నారు.
ఆ ఒక్క సినిమా భూమిక రాతనే మార్చేసింది.ఆ సినిమా సక్సెస్ అవడంతో యూత్లో ఆమెకు ఎనలేని క్రేజ్ ఏర్పడింది.
ఆ తరువాత చాలా కాలం పాటు భర్తగా సినిమాలలో నటిస్తూ తెలుగు పరంగా ముందుకు సాగుతూ మళ్ళీ వెనక్కి తిరిగి చూసుకోలేదు.
అలా తెలుగు సినీ ఇండస్ట్రీలో కొద్దిరోజులపాటు భూమిక ఫీవర్ కొనసాగింది.కేవలం తెలుగు సినిమాలలో మాత్రమే కాకుండా కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించి స్టార్ హీరోయిన్ గా తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు ఏర్పరుచుకుంది.
ఆ తర్వాత సినీ ఇండస్ట్రీకి కొద్దికాలంపాటు దూరం అయింది.ఇదిలా ఉంటే ఇటీవలే సెకండ్ ఇన్నింగ్స్ ను కూడా మొదలు పెట్టేసింది.
ఇకపోతే ప్రస్తుతం సినిమాల్లో అక్క వదిన పాత్రలో నటించడం మొదలు పెట్టేసింది.యోగా ట్రైనర్ భరత్ ఠాకూర్ తో పెళ్లి చేసుకొని విడిపోయిన తరువాత మళ్లీ ప్రస్తుతం భూమిక కెరీర్ ను స్పీడప్ చేసే ప్రయత్నం చేస్తోంది.
"""/" /
ఒకప్పటి లాగా బిజీగా లేకపోయినప్పటికీ, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా సినిమాల్లో నటిస్తోంది.
భూమిక ప్రస్తుతం నాలుగు పదుల వయసు దాటినా కూడా హాట్ ఫోటో షూట్ లతో ఇప్పటికీ పదహారేళ్ల అమ్మాయి గా కనిపిస్తూ ఉంటుంది.
ఇది ఇలా ఉంటే తాజాగా బ్లాక్ కలర్ పొట్టి డ్రెస్ లో పదహారేళ్ల అమ్మాయి లాగా కనిపించి స్లిమ్ లుక్ లో అందరినీ ఆకట్టుకుంటోంది.
ఇందుకు సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో ఈ ఫోటోలను చూసిన అభిమానులు భూమిక నాలుగు పదుల వయసు దాటినా కూడా ఇంత అందంగా తయారయిందా అంటూ కామెంట్లు పెడుతున్నారు.
అంతేకాకుండా 40 ఏళ్ళ వయసులో 16 ఏళ్లు అమ్మాయిలాగా లుక్ ఏంటి అంటూ ఆమె పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.
భూమిక నీ అలా స్లిమ్ గా చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు.
నాగార్జున 100 వ సినిమా మీద ఫోకస్ పెడితే మంచిదని ఫ్యాన్స్ కోరుతున్నారా..?