సర్జరీ చేయించుకున్న హీరోయిన్.. వికటించడంతో గుర్తుపట్టలేని స్థితి?
TeluguStop.com
సినిమా ఇండస్ట్రీ అంటేనే ఒక గ్లామర్ ప్రపంచం.ఇండస్ట్రీలో నిలదొక్కుకోవాలంటే టాలెంట్ పాటు అందం కూడా చాలా అవసరం.
ముఖ్యంగా హీరోయిన్లు అందంగా ఉంటేనే అవకాశాలు వస్తాయి.అందంగా లేకపోతే ఇండస్ట్రీలో చాలా దారుణంగా అవమానాలు ఎదుర్కోవలసి వస్తుంది.
అందువల్ల చాలామంది హీరోహీరోయిన్లు అందంగా కనిపించడానికి సర్జరీలు చేయించుకుని వారి అందం రెట్టింపు చేసుకుంటారు.
కానీ కొన్ని సందర్భాలలో ఇలాంటి సర్జరీలు వికటించడం వల్ల అందం రెట్టింపు అవ్వడం సంగతి అటుంచితే ఉన్న అందం కూడా కోల్పోయి.
మానసికంగా కూడా భాద పడాల్సి వస్తుంది.అయితే కొన్ని సందర్భాలలో అందం కోసం చేసే సర్జరీలు మాత్రమే కాకుండా ఇతర సర్జరీలు కూడా వికటిస్తాయి.
ఈ కారణంగా శరీర అవయవాలలో చాలా మార్పులు చోటు చేసుకుంటాయి.ఇటీవల ఒక హీరోయిన్ కి ఇలాంటి పరిస్థితి ఎదురయ్యింది.
కన్నడ హీరోయిన్ స్వాతి సతీష్ ఇటీవల రూట్ కెనాల్ థెరపీ చేయించుకోవడానికి బెంగళూరులోని ఓ ప్రైవేట్ డెంటల్ హాస్పిటల్‌లో చేరింది.
ఆ ప్రైవేట్ హాస్పిటల్ లో ఆమెకు వైద్యులు రూట్ కెనాల్ థెరపీ చేశారు.
తీరా ఆ ఆపరేషన్ వికటించడంతో ముఖం అంతా వాచిపోయింది.దీంతో కంగారు పడవలసిన అవసరం లేదు.
రెండు మూడు రోజుల్లో తగ్గిపోతుందని డాక్టర్లు చెప్పారు.కానీ 3 వారాలకు కూడా తగ్గలేదు.
అంతేకాకుండా తీవ్రమైన నొప్పి కూడా ఉంది. """/" /
ఇటీవల సోషల్ మీడియా ద్వారా స్వాతి ఈ విషయాన్ని తెలియచేశారు.
తన మొహం ఇలా పాడవటంతో బయటికి వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది అంటూ ఆమె చెప్పుకొచ్చింది.
అంతే కాకుండా మొహం ఇలా ఉబ్బి ఉండటంతో సినిమా అవకాశాలు కూడా కోల్పోయాను అంటూ ఆవిడ ఆవేదన వ్యక్తం చేశారు.
అయితే సర్జరీ చేసే సమయంలో డాక్టర్ అనస్థీషియాకు బదులు సాలిసిలిక్ యాసిడ్ ఇవ్వటం వల్ల ఇలా జరిగిందని ఆమె చెప్పుకొచ్చారు.
తన పరిస్థితి ఇలా అవటంతో స్వాతి చికిత్స నిమిత్తం మరో ఆస్పత్రికి వెళ్ళింది.
అప్పుడు ఆమెకు ఈ విషయం తెలిసినట్లు సమాచారం.ప్రస్తుతం చికిత్స తీసుకుంటున్న స్వాతి కోలుకున్నాక సదరు డాక్టర్ పై కేసు వేయనున్నట్లు సమాచారం.
వీడియో వైరల్.. చెత్త లారీతో డోనాల్డ్ ట్రంప్