దోమ 2.5 మిల్లీ గ్రాములే.. కుడితే ప్రాణాలు పోతాయి..! డెంగీ, మలేరియా ఇతర వైరల్ ఫీవర్స్ తో భయాందోళన..

దోమ ఉండేది ఇంతే.కానీ అది కాటేసిందంటే.

మనిషి ప్రాణాలు కూడా కోల్పోవాల్సిందే.సాధారణంగా దోమ 2.

5 మిల్లీ గ్రాముల బరువు ఉంటుంది.కానీ  తన సైజు కంటే లక్షల రెట్లు పెద్దగా ఉండే మనుషులను కరిసి చంపేస్తున్నాయి.

ప్రస్తుతం వర్షాకాలంలో దోమలు వ్యాప్తి పెరుగుతుండడంతో తెలంగాణలో డెంగీ, మలేరియా ఇతర వైరల్ ఫీవర్స్ జనాన్ని వనికిస్తున్నాయి.

ప్రతి ఏటా ఆగస్టు 20న ప్రపంచ దోమల నివారణ దినోత్సవం సందర్భంగా దోమల నివారణపై ప్రజల్లో అవగాహన రావాల్సిన అవసరం ఉందని నిపుణులు సూచిస్తున్నారు.

మొదటిసారిగా దోమ కాటు ద్వారా మలేరియా జ్వరం ప్రపంచానికి తెలిపింది హైదరాబాద్ నగరమే.

సర్ రోనాల్డ్ రాస్ ఆగస్టు 20 1887లో హైదరాబాద్ లో రేపే విస్తృత పరిశోధనలు జరిపి  మలేరియా దోమకాటు కారణమని తేల్చారు.

ఇప్పటికీ ఆయన పరిశోధనలు చేసిన భవనం బేగంపేటలో ఆయన పేరు మీదుగా సార్ రోనాల్డ్ రోస్ ఇన్స్టిట్యూట్ గా పిలువబడుతుంది.

మలేరియా బారిన పడి లక్షలాది మంది ప్రజలు చనిపోవడంతో  వారిని కాపాడే లక్ష్యంతో ఆయన అనేక పరిశోధనలు చేశారు.

పరిసరాల పరిశుభ్రత తోనే దోమలు వృద్ధి కి చెక్.దోమల నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై ఇప్పటికీ గ్రామీణ మారుమూల, పల్లె, ప్రాంత ప్రజలకు అవగాహన లేదని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

దోమ కాటు నుండి కచ్చితంగా జాగ్రత్తలు పాటించాల్సిన  అవసరం ఉందని వైద్యులు సూచిస్తున్నారు.

డెంగ్యూ, మలేరియా చికెన్గున్యా  బారిన పడిన తర్వాత చికిత్స చేయడం కంటే ఇంట్లో పరిసరాల్లో దోమలు వృద్ధి చెందకుండా జాగ్రత్త పడటం మేలంటున్నారు.

"""/"/ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవడం, పూల కుండీలు టైర్లు ప్లాస్టిక్ వస్తువులు నీరు నిల్వ ఉండకుండా చూడటం చెత్తాచెదారం లేకుండా శుభ్రంగా ఉంచుకోవడం ద్వారా దోమలు వృద్ధి  ఆగిపోతుందన్నారు.

దోమలు కరవకుండా ఇంటి ద్వారాలకు కిటికీలకు మెష్లు, శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే దుస్తులు ధరించడం ద్వారా దోమా తెరలు  వినియోగించాలని సూచించారు.

డెంగ్యూ కేసులు పెరుగుతున్న సమయంలో అనారోగ్య లక్షణాలు కనిపిస్తే సొంత వైద్యం చేసుకోకుండా వైద్య పరీక్షలు చేయించుకోవాలని వైద్య, ఆరోగ్య శాఖ సూచిస్తుంది.

చాలామంది డెంగ్యూ సోకిన కరోనా సోకిందని భావించి రోజుల తరబడి పారాసిట్మల్ మందులు, నీటి ఆవిరి చేసుకుంటున్నారని మూడు రోజుల్లో ఆ పేషెంట్ రక్తంలో ప్లేట్లెట్స్ పడిపోతున్నాయని వారు స్పష్టంచేశారు.

లేటు వయసులో పెళ్లి పీటలు ఎక్కిన నటుడు సుబ్బరాజు… ఫోటోలు వైరల్!