తెలుగు భాష ఔన్నత్యాన్ని తగ్గించే హక్కు మీకెక్కడిది.. ఏపీ సీఎం కు జీవీఎల్ లేఖ..!

తెలుగు అకాడెమీ పేరుని తెలుగు సంస్కృతి అకాడెమీ మార్చుతూ ఏపీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని తప్పుపడుతున్నారు నేతలు.

ఈ క్రమంలో బీజేపీ రాజ్యసభ సభ్యుడు జీవీఎల్ నరసింహా రావు కూడా వైఎస్ జగన్ మీద మండిపడ్డారు.

మూడున్నర వేల సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు భాష ఔన్నాత్యాన్ని తగ్గించే అధికారం మున్నాళ్లకు ఎన్నికయ్యే మీకు ఎక్కడిది సీఎం గారు అంటూ ఫైర్ అయ్యారు.

తెలుగు అకాడెమీ పేరు మార్చడంపై సీఎం కు జీవీఎల్ లేఖ రాశారు.మీరు అధికారంలోకి వచ్చినప్పటి నుండి తెలుగు ప్రాముఖ్యతను తగ్గించే నిర్ణయాలు తీసుకుంటున్నారని.

తెలుగు భాష సంస్కృతి, ఉనికికి ఆధారమని.తెలుగు భాషని చిన్నచూపు చూస్తే తెలుగు వారి ఆత్మ గౌరవాన్ని, ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీయడమే అని లేఖలో ప్రస్థావించారు జీవీఎల్.

మన భాష మీద మనకు మక్కువ లేకపోవడం దౌర్భాగ్యమని అన్నారు.బ్రిటీష్ వారు పరిపాలించినప్పుడు కూడా ఇంతటి సాహసం చేయలేదని ఆయన అన్నారు.

తాము ఆంగ్ల భాషకు వ్యతిరేకం కాదని విదేశీ భాష మోజులో మాతృభాషకి అన్యాయం చేయడం దుస్సాహ్సమని అన్నారు.

ప్రభుత్వం పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం తప్పనిసరి చేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు.డిగ్రీలో తెలుగు మాధ్యమం ఎత్తేశారంటూ వైసీపీ ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు జీవీఎల్.

"""/"/ ఉన్నత విద్య, సాంకేతిక విద్య కూడా భారతీయ భాషల్లో బోధించేందుకు కేంద్రం ప్రయత్నం చేస్తుంటే మీరు మాత్రం సర్వం ఆంగ్లమయం చేయాలని ప్రయత్నిస్తున్నారంటూ మండిపడ్డారు జీవీఎల్.

మీరు జాతీయ విద్యా విధానానికి వ్యతిరేకంగా పనిచేయడం ఎంతవరకు కరెక్ట్ సీఎం గారు అంటూ అడిగారు జీవీఎల్.

సంస్కృతికి కొత్త అకాడెమీ స్థాపించి ఆదర్శంగా నిలబడాలని సూచించారు.మాలాగా మీరు తెలుగు మీడియంలో చదవలేదు కాబట్టి ఈ తెలుగు లేఖని చదవడానికి ఇష్టపడరని ఈ లేఖని ఆంగ్లంలో కూడా పంపుతున్నా అని జీవీఎల్ సీఎం జగన్ కు లేఖ రాశారు.

టీ గ్లాస్ పట్టుకున్న స్టార్ హీరో అల్లు అర్జున్.. ఆ పార్టీకి ప్రచారం చేస్తున్నారా అంటూ?