వైరల్: చిన్నారికి యముడిలా మారిన సంరక్షకురాలు..!

పిల్లలను కనడం వరకు మాత్రమే మా బాధ్యత అని చాలామంది తల్లితండ్రులు అనుకుంటూ ఉంటారు.

ఎందుకంటే కొంతమంది తల్లి తండ్రులు ఉద్యోగాల నెపంతో తమ కన్నా బిడ్డలను ఇంట్లోనే వదిలేసి పొద్దునే ఉద్యోగాలకు వెళ్లి ఎప్పుడో సాయంత్రానికి ఇంటికి చేరుకుంటున్నారు.

పిల్లల ఆలనా పాలన చూడడానికి ఒక ఆయను పెట్టేసి చేతులు దులిపేసుకుంటున్నారు.ఈ నేపథ్యంలోనే ఒక దారుణమైన ఘటన ఒకటి ఒక పసిబిడ్డ విషయంలో చోటు చేసుకుంది.

చంటిబిడ్డ బాగోగులు చూసేందుకు నియమించుకొన్న సంరక్షకురాలే ఆ బిడ్డ పట్ల అమానుషంగా ప్రవర్తించి ఆ చిన్నారీ ప్రాణాల మీదకు తెచ్చింది.

వివరాల్లోకి వెళితే.గుజరాత్‌ రాష్ట్రం సూరత్‌లోని పలాన్‌పుర్‌ పటియాలో నివసించే మితేశ్‌ పటేల్‌, ఆయన భార్య ఇద్దరూ ఉద్యోగులు కావడంతో వారి 4 నెలల వయసు కవల పిల్లలను చూసుకునేందుకే గతేడాది సెప్టెంబరులో కోమల్‌ తందేల్కర్‌ అనే మహిళను సంరక్షకురాలిగా పెట్టుకున్నారు.

అయితే ఈ మధ్యనే పిల్లలిద్దరూ బాగా ఏడుస్తున్నారంటూ ఇరుగు పొరుగు మితేశ్‌కు చెప్పడంతో రెండు రోజుల క్రితమే వారి ఇంట్లో సీసీ కెమెరాలను బిగించారు.

అయితే శుక్రవారం ఉన్నటుండి కవలల్లోని మగ శిశువు ఏడ్చి ఏడ్చి మూర్చపోవడంతో మితేశ్‌ వెంటనే ఇంటికొచ్చి ఆస్పత్రికి తరలించారు.

అయితే ఆ బాబు మెదడులో రక్తస్రావం జరిగిందని గుర్తించి వైద్యులు ఆ బాబును ఐసీయూలో చికిత్స నిమిత్తం తరలించారు.

"""/" / తరువాత అనుమానం వచ్చి ఇంట్లోని సీసీ టీవీ ఫుటేజీని పరిశీలించగా అందులో దృశ్యాలను చూసి తల్లితండ్రులు ఇద్దరూ కూడా షాక్ అయ్యారు.

పిల్లలను జాగ్రతగా చూసుకోమని పెట్టిన ఆయా అయిన కోమల్‌ తన ఒడిలో ఉన్న 8 నెలల బాబును ఒకటిన్నర నిమిషాల పాటు విపరీతంగా కొట్టడంతో పాటు ఆ బాబు తలను కూడా నేలకేసి పదే పదే కొట్టసాగింది.

పాపం ఆ పసిబిడ్డ గుక్కప్పటి ఏడుస్తున్నగాని కోమల్ మనసు కనికరించలేదు.ఆ పసికందు చెవుల మెలితిప్పుతూ మంచంపైకి పదేపదే విసిరికొట్టింది.

అభం శుభం తెలియని ఆ పసిబిడ్డకు నరకం చూపించి మరి చిన్నారిని చావు బతుకుల దాక తీసుకుని వెళ్ళింది.

శనివారం బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కోమల్‌ను అరెస్టు చేసి కేసు నమోదు చేసారు.

తల్లి దండ్రులుగా మనం ఎంత సంపాదించిన అది మన పిల్లల బంగారు భవిష్యత్తు కోసమే అని మాత్రం మరవకండి.

ఈ 6 గురు హీరోలతో సాయి పల్లవి ఎందుకు నటించడం లేదు ?