వధువుని ఎత్తుకొని కిందపడేసిన వరుడు.. నెట్టింట నవ్వులే నవ్వులు !

సోషల్ మీడియా వైరల్ అయ్యే వధూవరుల వీడియోలు మనల్ని భలే ఆకట్టుకుంటాయి.కొన్ని వీడియోలు ఆశ్చర్యపరిస్తే.

కొన్ని వీడియోలు కడుపుబ్బా నవ్విస్తాయి.అయితే వీటిలో రెండో రకానికి చెందిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్‌గా మారింది.

ఈ వీడియోలో వరుడు తన భార్యని ఎత్తుకొని ఒక రూమ్ లోకి తీసుకెళ్దాం అనుకున్నాడు కానీ సీన్ రివర్స్ కావడంతో వధువు భారీ షాక్ తింది.

వైరల్ అవుతున్న వీడియోలో వరుడు వధువును తన రెండు చేతుల్లోకి ఎత్తుకోవడం చూడొచ్చు.

అయితే వరుడు మద్యం తాగినట్టు కనిపించింది.ఎందుకంటే అతడి నడక బాగా తడబడింది.

ఎత్తుకోగానే వధువు కూడా అరిచేసింది.అయితే భర్త పై నమ్మకం ఉంచి ఆమె అలాగే అతని చేతుల్లో ఉండిపోయింది.

తర్వాత అతడు ముందుకు నడుస్తూ ఆమెను తీసుకెళ్లడం ప్రారంభించాడు.ఈ క్రమంలోనే అతడు ఒక మెట్టు పై సరిగా కాలు పెట్టలేకపోయాడు.

దీంతో అతడి కాలు మడమ మడత పడింది.అంతే అతడు క్షణాల్లోనే కింద పడిపోయాడు.

అలాగే వధువుని కూడా చాలా వేగంగా కింద పడేశాడు.దీంతో ఆ పెళ్లి కూతురికి బాగా దెబ్బ తగిలింది.

"""/" / ఈ వీడియోని లాడ్ బైబిల్ అనే ఒక ఇన్‌స్టాగ్రామ్ వీడియో షేర్ చేసింది.

దీనికి ఇప్పటికే ఒక మిలియన్ పైగా వ్యూస్, 1 లక్షకుపైగా లైకులు వచ్చాయి.

ఈ వీడియో చూసిన నెటిజన్లు అయ్యో పాపం అని కామెంట్లు చేస్తున్నారు.మరికొందరు మాత్రం బాగా నవ్వుకుంటున్నారు.

ఈ ఫన్నీ వీడియోపై మీరు కూడా ఓ లుక్కేయండి.