కుక్కను కాపాడేందుకు పెళ్లిని సైతం ఆపేసిన వరుడు.. వీడియో వైరల్!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ఒక హార్ట్ టచింగ్ వీడియో వైరల్ అవుతోంది.ఈ వీడియోలో ఒక వ్యక్తి ప్రాణాలకు తెగించి మరీ ఒక వీధి కుక్కను కాపాడాడు.

ఈ కుక్కను రక్షించేందుకు అతడు తన వెడ్డింగ్ ని కూడా కాసేపు ఆపేశాడు.

అలా కుక్క ప్రాణాలను కాపాడి తన గొప్ప హృదయాన్ని చాటుకున్నాడు దీనికి సంబంధించిన వీడియోని చూసి నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

యానిమల్స్ లవర్స్ ఈ వరుడిని పొగడ్తలతో ముంచెత్తుతున్నారు.వైరల్ అవుతున్న వీడియోలో ఒక నది చాలా ఉదృతంగా ప్రవహించడం చూడొచ్చు.

అయితే ఈ నది ప్రవాహానికి ఒక ప్రహరీ గోడ కట్టారు.ఇదే గోడ ఎక్కి ఒక ప్రమాదంలో పడిపోయింది కుక్క.

కాంక్రీట్ గోడ దిగువన ఇది పడిపోయింది.అయితే అది అక్కడి నుంచి పైకి రాలేకపోయింది.

మరోవైపు నీటి ప్రవాహ మట్టం ఈ కుక్కను ఉన్న ఎత్తుకు పెరిగింది.ఇంకొంచెం ఆలస్యమైతే ఈ కుక్క ఉన్న ప్రాంతం మొత్తం నీటితో నిండిపోయేలా అనిపించింది.

దీంతో కుక్క తన ప్రాణాలుపై ఆశలు వదిలేసుకుని, దేవుడిపై భారం వేసి అలాగే కూర్చుండిపోయింది.

అయితే కొద్ది దూరంలోనే పెళ్లి చేసుకుంటున్న వరుడు దీనిని చూశాడు.అనంతరం నిస్సహాయ, ప్రాణాపాయ స్థితిలో ఉన్న శునకాన్ని కాపాడేందుకు ముందుకొచ్చాడు.

ఇందుకు అతడు కాంట్రాక్ట్ గోడపై పడుకొని కుక్కను రక్షించాడు.ఈ వీడియో చూసిన నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

మూగ జీవిని కాపాడిన ఈ పెళ్ళికొడుకుకు ధన్యవాదాలు చెబుతున్నారు.ఈ హార్ట్ టచింగ్ రెస్క్యూ వీడియోని మీరు కూడా చూసేయండి.

ఆ విషయంలో అనసూయ స్ట్రిక్ట్..ఎక్కడ కట్ చేయాలో బాగా తెలుసు: హైపర్ ఆది