ఎలక్ట్రిక్ స్కూటర్‌పై పెళ్లి మండపానికి వచ్చిన వరుడు.. ఫొటో చూస్తే ఫిదా..
TeluguStop.com
బెంగళూరు సిటీ టెక్ స్టార్టప్‌లు, టెక్నాలజీ సంస్థలకు పేరు గాంచింది.ఇక్కడి ప్రజలు అన్ని సందర్భాల్లో టెక్నాలజీను వాడేస్తూ ఆశ్చర్యపరుస్తుంటారు.
అక్కడ ఇటీవల ఓ పెళ్లికొడుకు తన పెళ్లికి ఎలక్ట్రిక్ స్కూటర్ మీద వచ్చి అందరినీ ఆశ్చర్యపరిచాడు.
ఆ స్కూటర్ పేరు ఏథర్ రిజ్టా.సాధారణంగా పెళ్లి కుమారులు పెళ్లి మండపాలకు గుర్రాలు లేదా ఖరీదైన కార్లలో వస్తారు కదా! ఈయన మాత్రం అందరికీ భిన్నంగా ఎలక్ట్రిక్ స్కూటర్( Electric Scooter)ని ఎంచుకున్నాడు.
"""/" /
బరాత్ అనే పెళ్లి ఊరేగింపులో, పెళ్లికొడుకు తన స్నేహితులతో కలిసి ఆ ఎలక్ట్రిక్ స్కూటర్ పక్కనే డ్యాన్స్ చేశాడు.
ఇది పాత సంప్రదాయంలో కొత్తదనం చేర్చడం లాగా ఉంది.ఈ పెళ్లి వీడియో సోషల్ మీడియా( Social Media)లో చక్కర్లు కొట్టింది.
45,000 కంటే ఎక్కువ మంది చూశారు.ఆ పెళ్ళికొడుకు పేరు దర్శన్ పటేల్.
ఆయన ఏథర్ ఎనర్జీ కంపెనీలో ఇండస్ట్రియల్ డిజైనర్‌గా పనిచేస్తున్నాడు.ఈ ఏథర్ ఎనర్జీ కంపెనీనే ఏథర్ రిజ్టా ఎలక్ట్రిక్ స్కూటర్‌ని తయారు చేస్తుంది.
దర్శన్ పటేల్ ఎలక్ట్రిక్ స్కూటర్ రావడం పట్ల ఏథర్ కంపెనీ కోపౌండర్ అయిన తరుణ్ మెహతా హర్షం వ్యక్తం చేశారు.
ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫ్యామిలీ పర్సన్స్‌కు బాగుంటుంది అని కూడా చెప్పాడు.వరుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై వచ్చిన ఫొటోలు, వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి.
చాలా మంది నెటిజన్లు ఈ వినూత్నమైన ఆలోచనను, పర్యావరణ అనుకూలతను మెచ్చుకున్నారు.కొందరు "జీరో ఎమిషన్ హార్స్" అని కూడా పిలిచారు.
బెంగళూరు రద్దీగా ఉండే ట్రాఫిక్‌లో రెండు చక్రాల వాహనాలను ఉపయోగించడం చాలా సులభం అని, నగర రోడ్లలో ప్రయాణించడానికి ఇది ఒక తెలివైన ఎంపిక అని కొందరు వ్యాఖ్యానించారు.
"""/" /
వరుడు ఎలక్ట్రిక్ స్కూటర్‌పై రావడం బెంగళూరు నగరంలో కొత్తేం కాదు.
ఈ సంవత్సరం జనవరిలో, మరొక వరుడు తన పెళ్ళిపార్టీతో కలిసి యులు ఎలక్ట్రిక్ బైక్‌లపై వేదికకు చేరుకున్నాడు.
ఇలాంటి సంఘటనలు నగరంలో ఒక కొత్త ధోరణికి సంకేతంగా నిలుస్తున్నాయి.పాత ఆచారాలను ఆధునిక, పర్యావరణ అనుకూల ఎంపికలతో మిళితం చేస్తున్నారు.
వైరల్ వీడియో: పాముతో పరచకాలు చేస్తే.. రిజల్ట్ ఇట్లే ఉంటది మరి