Governor CP Radhakrishnan : ఝార్ఖండ్ గవర్నర్‎కు తెలంగాణ గవర్నర్‎గా అదనపు బాధ్యతలు

తెలంగాణకు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము( Draupadi Murmu ) కొత్త గవర్నర్ ను నియమించారు.

ఈ మేరకు ఝార్ఖండ్ గవర్నర్‎ సీపీ రాధాకృష్ణన్( Governor CP Radhakrishnan ) కు తెలంగాణ గవర్నర్‎గా అదనపు బాధ్యతలను అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.

తెలంగాణతో పాటు పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ బాధ్యతలను కూడా రాధాకృష్ణన్ కే అప్పగించారు.

రెండు రాష్ట్రాలకు పూర్తి స్థాయి గవర్నర్ ను నియమించేంత వరకు ఆయన ఈ అదనపు బాధ్యతలను నిర్వర్తించనున్నారు.

కాగా నిన్న తెలంగాణ గవర్నర్ పదవికి, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్ పదవికి తమిళిసై సౌందర రాజన్ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.

వైరల్ వీడియో: అరె ఏంట్రా ఇది.. పళ్లతో అంత బరువుని ఎలా ఎత్తేశావ్?