కాలిఫోర్నియా గవర్నర్ సంచలన నిర్ణయం..బహుశా ఏ దేశంలో ఇలా జరిగి ఉండదు..!!!

కరోనా మహమ్మారి అమెరికాలో వేగంగా వ్యాప్తి చెందుతోంది.ప్రతీ రోజూ దాదాపు లక్ష మార్క్ కేసులు నమోదు అవుతున్నాయి.

ఈ నేపధ్యంలో అమెరికాలోని పలు రాష్ట్రాలు తమ ప్రజల రక్షణ కోసం వ్యాక్సినేషన్, మాస్క్, సామాజిక దూరం వంటి నిభంధనలను కటినంగా అమలు చేస్తున్నారు.

అయితే ప్రస్తుతం ఈ డెల్టా వైరస్ అత్యధికంగా పిల్లపై తీవ్రమైన ప్రభావం చూపుతున్న నేపధ్యంలో ఆయా రాష్ట్రాలు అందుకు తగ్గట్టుగా చర్యలు చేపడుతున్నాయి.

ఇందులో భాగంగా కాలిఫోర్నియా రాష్ట్ర గవర్నర్ తమ రాష్ట్రంలో ఉన్న పిల్లల సంరక్షణ దృష్ట్యా సంచలన నిర్ణయం తీసుకున్నారు.

కాలిఫోర్నియా వ్యాప్తంగా అన్ని స్కూళ్ళు, కాలేజీలలో పనిచేస్తున్న టీచర్ లు అలాగే సిబ్బంది తప్పనిసరిగా వ్యాక్సిన్ వేసుకోవాల్సిందే నని ఆదేశాలు జారీ చేశారు.

ఎంతో మంది టీచర్స్, సిబ్బంది వ్యాక్సిన్ వేసుకోకుండానే పాటశాలలకు హాజరవుతున్నారని, అలాంటి వారి వలన పిల్లలకు కరోన వస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇకపై టీచర్స్, సిబ్బందికి వ్యాక్సిన్ తప్పనిసరి చేశామంటూ ఆ రాష్ట్ర గవర్నర్ గేవిన్ న్యూసమ్ తెలిపారు.

ఈ మేరకు మీడియా సమావేశంలో వెల్లడించిన గేవిన్ ఈ నిభందన తక్షణమే అమలు అవుతుందని ప్రకటించారు.

"""/"/ ప్రస్తుతం డెల్టా ఆందోళన కరంగా ఉందని, ఓ తండ్రిగా పిల్లల భాద్యత తెలుసు కాబట్టి ఈ నిభందన తీసుకువచ్చామని, ప్రతీ స్కూల్ లో ఈ నిభందన అమలు అవ్వాలని ఆదేశించారు.

గతంలో పిల్లలతో నిండుగా ఉన్న పాటశాలలు మళ్ళీ ఆ స్థాయిలో ఉండాలని కోరుకుంటున్నాని తెలిపారు.

స్కూల్స్ కు వచ్చే పిల్లలకు తప్పనిసరిగా మాస్క్ ఉండాలని, సామాజిక దూరం పాటించేలా దూరంగా వారిని కూర్చోబెట్టాలని సూచించారు.

మాస్క్ నిభందన టీచర్స్ కు కూడా వర్తిస్తుందని ఏ ఒక్కరూ నిభందన పాటించక పోయినా చర్యలు తప్పవని హెచ్చరించారు.

ఇదిలాఉంటే గవర్నర్ గేవిన్ తీసుకున్న నిర్ణయం పట్ల కొందరి నుంచీ వ్యతిరేకత వస్తున్నా మెజారిటీ ప్రజలు మాత్రం గవర్నర్ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నారు.

లిక్కర్ కేసులో సిసోడియాకు బెయిల్ తిరస్కరణ..!