చైనాలో సంచ‌ల‌న చ‌ట్టం తీసుకొచ్చిన ప్ర‌భుత్వం.. ముగ్గురు పిల్ల‌ల్ని క‌నొచ్చ‌ట‌

ప్ర‌పంచంలోనే అత్య‌ధిక జ‌నాభా చైనాలోనే ఉంది.దీంతో ఆ దేశఃలో ఎలాగైనా జ‌నాభాను నియంత్రించేందుకు గ‌తంలో ఓ చ‌ట్టాన్ని తీసుకొచ్చిన సంగ‌తి తెలిసొందే.

ఒక్క‌రు చాలంటూ అంత‌కు మించి వ‌ద్దంటూ పెద్ద ఎత్తున అవ‌గాహ‌న క‌ల్పించారు.దీంతో ఆ దేశ‌స్థులు దాన్ని సిన్సియ‌ర్ గా పాటించేశారు.

ఈ మార్పు పెద్ద యుద్ధం లాగే కొన‌సాగింది.ఇక ఈ మార్పుతో ఆ దేశంలో యువ‌త గ‌ణ‌నీయంగా త‌గ్గిపోయారు.

వ‌యో వృద్ధ జ‌నాభానే గ‌ణ‌నీయంగా పెరిగింది.దీంంతో ఇప్పుడు మ‌రో విప్ల‌వానికి తెర‌లేపింది అక్క‌డి ప్ర‌భుత్వం.

ఆ దేశఃలో ముగ్గురు పిల్ల‌లను కనొచ్చ‌ని చెప్పేసింది.ఇందుకు గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చేసింది.

ఇక ఇందుకోసం రీసెంట్ గా కీలక చట్టానికి ఆమోదం తెలిపింది చైనా.చైనా దేశంలో నేష‌న‌ల్ పీపుల్స్ కాంగ్రెస్ 13వ స్టాండింగ్ క‌మిటీ మీటింగులు ఇప్పుడు జ‌రుగుతున్న సంద‌ర్భంగా జనాభా, అలాగే కుటుంబ నియంత్ర‌ణా చ‌ట్టాల‌ను కూడా స‌వ‌రించారు ఆ దేశ అధ్య‌క్షుడు.

ఇందుకు సంబంధించిన అమ‌లు చ‌ట్టాల ప‌త్రాల‌పై చైనా అధ్య‌క్షుడు జీ జిన్‌పింగ్ సంత‌కం కూడా చేశారు.

ఇప్ప‌ట‌గి వ‌ర‌కు కూడా ప్రపంచంలోనే అత్యధిక జనాభా చైనాలోనే ఉంది. """/"/ ఈ జ‌నాభా గ‌తంలో యూత్‌గా ఎక్కువ‌గా ఉండేస‌రికి జనాభా నియంత్ర‌ణ ప్ర‌ణాళిక‌లో భాగంగా గతంలో వన్ చైల్డ్ పాలసీని తీసుకొచ్చింది.

ఆ దేశఃలో చైనా ప్ర‌భుత్వం దాదాపుగా 40 ఏళ్ల పాటు క‌ట్టుదిట్టంగా అమలు చేసి యూత్ జ‌నాభాను నియంత్రించ‌డంలో బాగానే స‌క్సెస్ అయింది.

దేశంలో కొత్తగా పుట్టుకలు గ‌ణ‌నీయంగా ప‌డిపోవ‌డంతో యూత్‌ సంఖ్యను పెంచే దిశ‌గా ముగ్గురు పిల్లల పాలసీని తీసుకొచ్చింది చైనా.

ఈ మేర‌కు ముగ్గురు పిల్లల్ని క‌నాల‌నుకునే వారికి తోడ్పాటు ఇవ్వనుంది చైనా జిన్‌పింగ్ ప్ర‌భుత్వం.

ఒక్కో శిశువుకు 1.50 లక్షల డాలర్లను కూడా ప్రోత్సాహం కింద ఇవ్వ‌నుంది.

కక్ష సాధింపులకు పాల్పడవద్దు చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు..!!